MoviesTollywood news in telugu

Tamanna:సినిమాల ద్వారా తమన్నా ఎన్ని కోట్లు వెనకేసిందో తెలుసా…అసలు నమ్మలేరు

Star Heroine Tamanna: తమన్నా ‘శ్రీ’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. వెండితెరకు వచ్చి దాదాపుగా 20 సంవత్సరాలు అయింది. ప్రస్తుతం తమన్నా తెలుగు, తమిళ్ అనే తేడా లేకుండా అన్ని భాషలలో వరస ఆఫర్లతో బిజీగా ఉంది. ప్రస్తుతం తమన్నా సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ గా ఉంది. ఒక వైపు సినిమాలు చేస్తూ మరొక వైపు వెబ్ సిరీస్‌ లు చేస్తుంది.

తమన్నా సినిమాలు, అడ్వర్టైజ్మెంట్లు, వెబ్ సిరీస్ లు ఇలా వచ్చిన ప్రతి అవకాశాన్ని వదలకుండా పట్టుకొని ముందుకు దూసుకువెళ్ళుతుంది. ప్రస్తుతం తమన్నా టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంక‌ర్‌తో పాటు.. తమిళ సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్ జైల‌ర్‌ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.ఒక్కో సినిమాకి దాదాపుగా 4 నుంచి 5 కోట్ల వరకు తీసుకుంటుంది.

తమన్నా సినిమాల్లో ఎంత సంపాదించింది అనే విషయానికి వస్తే…ఏడాదికి సినిమాలు, యాడ్స్ ద్వారా 20 కోట్ల‌కు పైగా సంపాదిస్తుంది. 2015లో వైట్ & గోల్డ్ పేరుతో జ్యూవ్వెలరీ బిజినెస్ ను మొదలుపెట్టింది. బిజినెస్ లో కూడా చాలా సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. త‌మ‌న్నా ఆస్తుల విలువ మొత్తంగా 120 కోట్ల‌కు పైగా ఉంటుంద‌ని సమాచారం.