MoviesTollywood news in telugu

Tollywood Heroes Marriage Age :పెళ్లి చేసుకునే సమయానికి మన హీరోల వయస్సు ఎంతో తెలుసా?

Tollywood Heroes Marriage Age :టాలీవుడ్ లో హీరోల గురించి ఏ విషయం తెలిసిన వారి అబిమానులకు చాలా సంతోషం కలుగుతుంది. ప్రతి ఒక్క విషయాన్నీ గుర్తుంచుకుంటారు. పెళ్లి చేసుకునే సమయానికి మన హీరోల వయస్సు ఎంతో తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.

ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు అయిన హీరోలు ఉన్నారు. అయితే మొదటి సారి పెళ్లి చేసుకున్న వయస్సుని పరిగణనలోకి తీసుకుంటే, ఎన్టీఆర్ 20 ఏళ్లకే బసవతారకం ను పెళ్లిచేసుకున్నారు. అయితే అక్కినేని నాగేశ్వరరావు పాతికేళ్ల వయస్సులో పెళ్లిచేసుకున్నారు.

ఇందిరాదేవిని పెళ్లాడే సమయానికి సూపర్ స్టార్ కృష్ణ 19ఏళ్ళ వయస్సులో ఉన్నారు. శోభన్ బాబు 21ఏళ్ల వయస్సులో పెళ్లిచేసుకున్నారు. 1969లో 23 ఏళ్లకే ఎస్పీబాలు పెళ్లిచేసుకున్నారు. రజనీకాంత్ 30ఏళ్ళవయస్సులో పెళ్లిచేసుకున్నాడు. 1980లో మెగాస్టార్ చిరంజీవి అల్లు రామలింగయ్య కూతురు సురేఖను పెళ్లాడారు. అప్పటికి చిరంజీవి వయస్సు 24ఏళ్ళు.

కమల్ హాసన్ కూడా 24ఏళ్ల పెళ్లి చేసుకున్నాడు. నందమూరి బాలకృష్ణ 22ఏళ్ళ వయస్సులో వసుంధర దేవిని 1982లో పెళ్లి చేసుకున్నారు. విక్టరీ వెంకటేష్ 1985లో పెళ్లిచేసుకున్నారు. అప్పటికి అతని వయస్సు 24ఏళ్ళు. అదే వయస్సులో నాగార్జునకు పెళ్లయింది. డాక్టర్ రాజశేఖర్ 30ఏళ్ళ వయస్సులో జీవితను పెళ్లి చేసుకున్నాడు.

శ్రీకాంత్ 29ఏళ్ళ వయస్సులో ఉండగా, ఊహను పెళ్లిచేసుకున్నాడు. 1997లో 25ఏళ్ల వయస్సులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెళ్లిచేసుకున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు 29ఏళ్ళ ప్రాయంలో నమ్రతను పెళ్లిచేసుకున్నాడు. ఇక 32ఏళ్ళ వయస్సులో మాస్ మహారాజు రవితేజ 2002లో కల్యాణిని పెళ్లిచేసుకున్నాడు.

జూనియర్ ఎన్టీఆర్ 2011లో 28ఏళ్ళ వయస్సులో పెళ్లిచేసుకున్నాడు. రామ్ చరణ్ కి 27ఏళ్ళవయస్సులో ఉపాసనతో పెళ్ళికాగా అల్లు అర్జున్ 28ఏళ్లకు పెళ్లిచేసుకున్నాడు. సమంతను పెళ్లాడే సమయానికి నాగచైతన్యకు 31ఏళ్ళు. రానా దగ్గుబాటి 2020లో పెళ్లిచేసుకున్నాడు. అప్పటికి అతడి వయస్సు 35ఏళ్ళు. నితిన్ 37ఏళ్ళ వయస్సులో 2020లో పెళ్లిచేసుకున్నాడు.
Click Here To Follow Chaipakodi On Google News

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."