Healthhealth tips in telugu

Dry Fruits : డ్రై ఫ్రూట్స్‌ను తినే ప‌ద్ధ‌తి ఇది.. వీటిని రోజూ ఇలా తింటే ఎన్నో ప్ర‌యోజనాలు..!

Dry Fruits : డ్రై ఫ్రూట్స్ లో ఎన్నో పోషకాలు ఉండుట వలన ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ దాదాపుగా తింటూ ఉన్నారు. ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఇష్టం వ‌చ్చిన‌ట్టు తినకూడదు. డ్రై ఫ్రూట్స్ ను ఎంత మొతాదులో.. ఏ విధంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి మేలు క‌లుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

డ్రైఫ్రూట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు ఐరన్, ప్రొటీన్, క్యాల్షియం, జింక్ వంటి సహజసిద్ధమైన మూలకాలు సమృద్దిగా ఉంటాయి. డ్రైఫ్రూట్స్‌ ని తప్పనిసరిగా నానబెట్టి తినాలి. అప్పుడే వంద శాతం పోషకాలు మన శరీరానికి అందుతాయి. అయితే ఏ డ్రైఫ్రూట్స్‌ ఎంత సమయం నానబెడితే మంచిదో తెలుసుకుందాం.

వాల్ నట్స్ ను 8 గంటలపాటు నీటిలో నానబెట్టాలి. రోజుకి 2 వాల్ నట్స్ తింటే సరిపోతుంది. అలాగే బాదం ను 12 గంటల పాటు నానబెట్టాలి. రోజులో 4 లేదా 5 బాదం పప్పులను తింటే సరిపోతుంది. గుమ్మడి గింజలు 7 గంటల పాటు నానబెట్టాలి. రోజులో ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది.

జీడిపప్పు 6 గంటలు, అవిసె గింజలు 6గంటలు, బ్రోకలీ గింజలు 8 గంటలు, శనగలు 8 గంటలు, వేరుశనగ గింజలు 7 గంటలు వరకు నానబెట్టాలి. వీటిని రోజులో దాదాపుగా స్పూన్ చొప్పున తీసుకుంటే సరిపోతుంది. వాల్ నట్స్ లో ఫైటిక్ రసాయనాలు ఉంటాయి. వీటిని నానబెడితే ఫైటిక్ రసాయనాలు తొలగిపోతాయి. ఫైటిక్ రసాయనాలు ఉన్న నట్స్ జీర్ణం కావటం కష్టతరంగా ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News