Healthhealth tips in telugu

Red chilli benefits: ఎర్ర కారం తింటున్నారా…ప్రతి ఒక్కరూ ఈ నిజాన్ని తెలుసుకోవాలి…లేదంటే…?

Red chilli benefits: మనలో కొంత మంది కారం ఎక్కువగా తింటారు. మరి కొంత మంది కారం అసలు తినటానికి ఇష్టపడరు. అయితే కారంలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వంటల్లో కారం వేయటం వలన రుచి, మంచి సువాసన వస్తుంది.

మనం ప్రతి రోజు వండుకునే వంటల్లో కారం తప్పనిసరిగా వేస్తాం. కూరల్లో సరిగ్గా కారం పడకపోతే ముద్ద దిగదు. కొంత మంది పచ్చి మిరపకాయలు వాడితే … మరికొంత మంది ఎండు కారం వాడుతూ ఉంటారు. కొంత మంది కారం ఎక్కువగా తింటారు.

మరి కొంత మంది కారం అంటే ఇష్టపడరు. అయితే ఇప్పుడు చెప్పే విషయాలను తెలుసుకొంటే కారం తినని వారు కూడా కారాన్ని ఇష్టంగా తింటారు. కానీ, ఇటీవల రకరకాల అనారోగ్యాల పేరుతో కారానికి దూరంగా ఉంటున్నారు చాలా మంది. కానీ తగినంత మోతాదులో కారాన్ని ఆహారంలో చేర్చుకోవాలని అంటున్నారు నిపుణులు.

ఎందుకంటే కారంలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఆ ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అల్సర్ ఉన్నవారు ఎక్కువ కారం తినకూడదు అని అంటూ ఉంటారు. అయితే ఇటీవల జరిగిన పరిశోధనల్లో కారంలో ఉండే కొన్ని సమ్మేళనాలు జీర్ణ సమస్యలను తగ్గిస్తాయని తేలింది.

రక్త ప్రసరణ మెరుగు అయ్యి గుండె సమస్యలు రావు. కీళ్ల నొప్పులు,తలనొప్పి ఉన్నవారు కారం తింటే మంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాక దగ్గు,జలుబు ఉన్నవారు కారం తింటే తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఎండు మిర‌ప‌కాయ‌ల పొడి (కారం)లో ఉండే అనేక ర‌కాల స‌మ్మేళ‌నాలు ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ రాకుండా కాపాడతాయని ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలింది.

ఎర్ర మిరపకాయ ఆకలిని తగ్గిస్తుంది. అలాగే శరీరంలోని జీవక్రియ రేటును పెంచడం ద్వారా అదనపు కొవ్వును కరిగిస్తుంది. అధిక మొత్తంలో పొటాషియం ఉండుట వలన రక్త నాళాలను రిలాక్స్‌గా ఉంచడానికి సహాయపడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావం ఉండుట వలన నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.

ఇది కూడా చదవండి: Coffee Facial Tips: బ్యూటీ పార్లర్ కి వెళ్ళే సమయం లేదా….కాఫీ పొడితో ఇలా చేస్తే ముఖం అందంగా మెరిసిపోతుంది..

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News