Healthhealth tips in telugu

Home Remedies : పులిపిర్లతో విసిగిపోయారా.. అయితే ఈ చిట్కాలుతో చెక్‌

Warts Tips:సాదారణంగా చాలా మందిలో కనిపించే సమస్య పులిపిరి కాయలు. ఇవి ప్రమాదకరమైనవి కాదు. అయితే ఇవి వచ్చినప్పుడు చూడటానికి ఇబ్బందిగానూ మరియు అసహ్యంగాను ఉంటాయి. వీటిని తొలగించటానికి ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ విసిగిపోయి ఉంటారు. అయితే ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా సులభంగా తొలగించుకోవచ్చు.

1. విటమిన్ సి పులిపిరి కాయలను పోగొట్టటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. అందువల్ల విటమిన్ సి సమృద్ధిగా లభించే ఉసిరిని పేస్ట్ గా చేసి పులిపిరి కాయల మీద రాయాలి.

2. సున్నంలో అల్లం ముక్కను ముంచి పులిపిరి కాయల మీద రాయాలి. ఈ విధంగా రాసేటప్పుడు పక్కన చర్మానికి అంటకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే సున్నం చర్మం మీద పడితే బొబ్బలు వచ్చే అవకాశం ఉంది.

3. ఆముదాన్ని రాయటం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు.

4. ఉల్లిపాయని మధ్యకు కోసి మధ్య భాగాన్ని తీసేసి దానిలో రాతి ఉప్పు వేసి ఆ రసాన్ని పులిపిరి కాయల మీద రాస్తే తగ్గిపోతాయి. ఈ విధంగా నెల రోజుల పాటు చేయాలి.

5. వెల్లుల్లిలో యాంటీ వైరల్ లక్షణాలు ఉండుట వలన పులిపిరి కాయలను తగ్గించటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.

6. అరటి పండు తొక్కతో పులిపిరి కాయలను రుద్దితే తగ్గటమే కాకూండా కొత్తవి కూడా రావు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."