Kitchenvantalu

Instant Noodles Rolls :నోరూరించే.. చైనీస్ నూడుల్స్ స్ప్రింగ్ రోల్స్ ఇంట్లోనే.. ఇలా..

Instant Noodles Rolls :నూడుల్స్ రోల్స్ఇంట్లో ఎన్ని స్నాక్స్ ఉన్నా, అప్పుడప్పుడు స్ట్రీట్ ఫుడ్ తినాలనపిస్తుంది. అందులో ఎక్కువగా చిన్నారులు అయినా పెద్దలైనా, ఇష్టపడేది నూడుల్స్. అందరూ ఇష్టపడే ఈ నూడుల్స్ రోల్స్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండీ, ఒకసారి టేస్ట్ చూపించారంటే, స్ట్రీట్ ఫుడ్ వద్దు ,ఇంట్లో చేసినవే ముద్దు అంటారు. ఇంకెందుకు ఆలస్యం చేసి పెట్టేసేయండి.

కావాల్సిన పదార్ధాలు
మైదా – 1 కప్పు
గోధుమపిండి – 1/4 కప్పు
ఉప్పు – ¼ టీ స్పూన్
చక్కెర – 1 టీ స్పూన్
నూనె – 2 టేబుల్ స్పూన్స్
ఉల్లిపాయలు – 1 కప్పు
తరిగిన పచ్చిమిర్చి – 2 టేబుల్ స్పూన్స్
వెనిగర్ – 2 టేబుల్ స్పూన్స్
క్యాప్సికమ్ – ½ కప్పు
తరిగిన వెల్లుల్లి – 1 టేబుల్ స్పూన్
చాట్ మసాలా – 1/2 టీ స్పూన్
కారం – ½ టీ స్పూన్
వెనిగర్ – 1 టీ స్పూన్
పుదీనా చెట్నీ – ½ కప్పు
రెడ్ ఛిల్లీ సాస్ – ¼ కప్పు
క్యాబేజ్ తురుము – 2 కప్పులు
టమాటోకెచప్ – 3 టీ స్పూన్స్

తయారీ విధానం
1.రోటీ కోసం మైదా, గోధుమపిండి,చక్కెర తీసుకుని, అందులోకి, 2 టేబుల్ స్పూన్స్, ఆయిల్ వసుకుని,మెత్తగా కలుపుకుని, రోటీ పిండీలా తయారు చేసుకోవాలి.
2. తయారు చేసిన పిండిముద్దపై , ఒక క్లాత్ కప్పి, గంటసేపు పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టఫ్పింగ్ కోసం,అన్ని కూరగాయలను కలపి ,ఒక గంట పాటు, మారినేట్ చేసుకోవాలి
4.ఇప్పుడు నూడుల్స్ కోసం ఒక పాన్ లో ఆయిల్ వేసుకుని, అందులోకి , ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్, మరియు, తరిగిన వెల్లుల్లి వేసి రెండు నిముషాలు హై ఫ్లేమ్ లో వేయించాలి.
5. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత , కారం , చాట్ మసాలా, వెనిగర్ వేసి, 30 సెకండ్ల పాటు, టాస్ చేయండి పక్కన పెట్టండి.
6. ఇప్పుడు వేరొక బాండీలో నీరు వేసుకుని, మరుగుతున్నప్పుడు, టేస్ట్ మేకర్, ఇన్ స్టెంట్ నూడుల్స్ వేసి, 90 శాతం వరకు ఉడికించుకోవాలి.
7. ఇప్పుడు మారినేట్ చేసుకున్న కూరగాయలను వడకట్టి పక్కన పెట్టుకోవాలి.
8. ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండి ముద్దను, చిన్న చిన్న ఉండలుగా చుట్టి, రోటీస్ చేసుకోవాలి. స్టవ్ పై పాన్ పెట్టుకుని, రోటీలను కాల్చుకోవాలి. సగం
కాలిన రోటీలను తీసుకుని, రెండు వైపులా నూనె రాసుకుని బాగా కాల్చాలి.
9. ఆ రోటీ మీద పుదీనా చెట్నీ వేసి , సెజ్వాన్ సాస్ స్ప్రెడ్ చేయండి.
10. తర్వాత చపాతి పై ఒకవైపున వడకట్టిన, కూరగాయలను, తురిమిన ఉల్లిపాయలను మరియు, ఉడికించుకున్న నూడుల్స్ ను, పొడవుగా ఒక వరుసలో వేయించు కోవాలి. దాని పై తురిమిన క్యాబేజ్ వేసి, చాట్ మసాలా చల్లుకోవాలి.
11. ఇప్పుడు దాని పై చీజ్, హాఫ్ టీ సూన్ టమాటో కెచప్ వేసి టైట్ రోల్ చేస్తే, నూడుల్స్ రోల్స్ రెడీ.

Click Here To Follow Chaipakodi On Google News