Healthhealth tips in telugu

Health Tips:ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి వెళ్ళుతున్నారా…ఈ విషయాలు తెలిస్తే అసలు వెళ్ళరు

Fast Food Facts : ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా దాదాపుగా ప్రతి ఒక్కరూ Fast Foods తినటానికి అలవాటు పడిపోయారు. వీటిని ఎక్కువగా తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎప్పుడైనా తింటే పర్లేదు.

సాయంత్రం అయిందంటే చాలు ప్రతి ఒక్కరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల వైపు వెళుతూ ఉంటారు. ఈ కల్చర్ నగరాల్లోనే కాకా చిన్న చిన్న పట్టణాలలో, చివరికి గ్రామాలకు కూడా పాకిపోయింది. యితే ఈ ఫాస్ట్ ఫుడ్ తినడం వలన మన ఆరోగ్యానికి కలిగే భయంకర ప్రభావం గురించి తెలుసుకుందాం.

1. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వాడే చికెన్ తాజాగా ఉండదు. నిన్న,మొన్న మిగిలిపోయిన వాటిని కూడా వాడుతూ ఉంటారు. అవి వాసన రాకుండా వెనిగర్ లో ముంచుతారు.
2. చికెన్ రైస్ చేసేటప్పుడు చెడిపోయి తెల్లగా మారిన చికెనుకు ఆరెంజ్ రంగు వేస్తారు.
3.సోయా సాస్ ….రేటు ఎక్కువ కాబట్టి దానిలో నీరు కానీ 10 రోజుల క్రితం కాగి కాగి మరరిగిన నూనెను కలుపుతారు.
4.ఏ షాపులోనూ మంచి నూనె వాడరు…పామాయిలు తప్ప ఏదీ వాడరు.

5.కళాయిలో అన్నం అంటుకుపోకుండా ఎక్కువగా పామాయిలును వాడి తొందరగా లేటు లేకుండా పదార్థాన్ని కస్టమర్లకు అందిస్తారు.
6. ఈ కళాయిలను రోజుల తరబడి కడగనే కడగరు.
7. అజినోమోటో అన్న పదార్థం ఎక్కువగా వాడకూడదు. అయితే అన్ని పదార్దాలలోను ఎక్కువగా వాడుతారు.
8. తెల్ల మిరియాలపొడి లో చేతికి దొరికిన పిండిని కలిపి వాడతారు. ఆ పిండిలో పురుగులు కూడా ఉంటాయి.
9.టొమాటో సాస్ ఎక్కువ మోతాదులలో కొనేస్తారు. అందువల్ల అవి చెడిపోయినా exp.date అయిన వాటిని కూడా వాడేస్తారు.
10.చిల్లీ సాస్.. వాడుతున్న బాటిలును మీ ముక్కు దగ్గర పెట్టుకుని చూస్తే….ఆ వాసనకు వాంతులు రావటం ఖాయం.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News