Healthhealth tips in telugu

Health Tips:ఏ ఆకుల్లో భోజనం చేస్తే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా!!

Banana leaf Food :పూర్వం మన పెద్దవారు తప్పనిసరిగా అరటి ఆకులో భోజనం చేసేవారు. ఈ తరం వారికీ ఆకులో భోజనం అంటే పెద్దగా తెలియటం లేదు. అయితే కొన్ని చోట్ల పెళ్లి భోజనలల్లోను, కొన్ని హోటల్స్ లో అరటి ఆకులో టిఫిన్స్,భోజనాలు వంటివి పెడుతున్నారు. ఈ తరం పిల్లలు కూడా ఆకులో భోజనం చేయటాన్ని ఆచరిస్తే మంచిది.

అన్నంలో ఒకవేళ విషం కలిపితే ఆకు నలుపు రంగుగా మారిపోతుంది., వేడి అన్నం వడ్డిస్తే ఆకులోని అనేక రకాల పోషకాలు ఈ అరటిఆకులో ఉన్నందున మంచి రుచిని కలిగిస్తాయి.. మరియు పర్యావరణానికి విఘాతం కలుగకుండా తేలికగా మట్టిలో కలిసిపోతాయి.. . అందుకే ఇంటికి వచ్చిన అతిధుల మనసులో అనుమానం రాకూడదనే ఉద్దేశ్యం తోనే అరిటాకులో భోజనం పెడతారు.

అరటి ఆకులో, విస్తరి ఆకులో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది.. ఆరోగ్య వంతులుగా ఉంటారు…
తామరాకులో భోజనం చేయడo వలన ఐశ్వర్యం కలిగి సాష్టాత్ లక్ష్మీ దేవి కటాక్షo కలుగుతుంది..
బాదాం ఆకులో భోజనం చేయడం వలన కఠిన హృదయులవుతారు.
టేకు ఆకులో భోజనం చేయడం వలన భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోగలిగే జ్ఞానం వస్తుంది..
జమ్మి ఆకు విస్తరిలో భోజనం చేస్తే లోకాన్ని జయించే శక్తి సంపాదించవచ్చునని తపఃసంపన్నులు జ్ఞానులు చెబుతారు..
రావి ఆకులో భోజనం చేస్తే జననేంద్రియ దోషాలు తొలగిపోతాయి. చిన్న పిల్లలకు చక్కని మాటలు వస్తాయి.
మోదుగ ఆకుల విస్తరిలో భోజనం చేస్తే కంటికి సంబందించిన సమస్యలు తొలగిపోతాయి.
మర్రి ఆకులతో కుట్టిన విస్తరిలో భోజనం చేస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని ఒక నమ్మకం.

పచ్చటి ఆకులో భోజనం చేయడం వల్ల ఆకులలో ఉండే క్లోరోఫిల్ మన శరీరంలోని అనేక రుగ్మతలను, పేగుల్లో ఉండే రకరకాల అనారోగ్యాన్ని కలిగించే క్రిములను నాశనం చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే ఆకులలో భోజనం చేయడం అన్ని విధాల శ్రేయస్కరం అని చెప్పబడింది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News