Kitchenvantalu

Sweet Pongal Recipe:పక్కా కొలతలతో టెంపుల్ స్టైల్లో చక్కెరపొంగలి.. చాలా సులువైన పద్దతిలో..

Sweet Pongal Recipe: నైవేథ్యాలలో ముందుండే, పొంగల్ గురించి, ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎన్ని నైవేథ్యాలు వండినా, అందులో చెక్కర పొంగలి చేసి తీరాల్సిందే. పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు
బియ్యం- 3/4కప్పు
పెసరపప్పు- 1/4కప్పు
బెల్లం-1/2కప్పు
చక్కెర-3/4కప్పు
యాలకుల పొడి – 1 స్పూన్
జీడిపప్పు – 15
ఎండుద్రాక్ష- 10
ఎండుకొబ్బరి ముక్కలు – 3 టేబుల్ స్పూన్స్
పసుపు కర్పూరం – చిటికెడు
నెయ్యి – 6 టేబుల్ స్పూన్

తయారీ విధానం

1.స్టవ్ పై పాన్ పెట్టుకుని, పెసర పప్పును దోరగా మంచి వాసన వచ్చేవరకు వేయించుకోవాలి.
2. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని, అందులోకి కడిగిన బియ్యం వేసి, వేయించుకున్న పప్పును యాడ్ చేసి, మూత పెట్టి, మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి.
3. ఇప్పుడు ఇంకొక పాన్ స్టవ్ పై పెట్టుకుని, అందులోకి బెల్లం , చక్కెర, కొంచెం నీరు కలపాలి.
4. అది కరిగిన తర్వాత, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
5. ఇప్పుడు ఉడికిన పప్పు అన్నంలోకి తయారు చేసుకున్న సిరప్ ను వడకట్టి పోసుకోవాలి
6. ఇప్పుడు సిరప్ మరియు అన్నం, రెండింటిని కలిపి, ఉడికించుకోవాలి.

7. మరొక బాండీ పెట్టుకుని, 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, అందులోకి, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, కొబ్బరి ముక్కలు వేయించుకోవాలి.
8. ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ను ఉడుకుతున్న అన్నంలో వేయాలి.
9. ఇప్పుడు అన్నం చిక్కగా అయ్యేంతవరకు, కలుపుకుంటూ ఉండాలి.
10. చివరిగా మరో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, మరో ఐదు నిముషాలు ఉడికించాలి.
11. ఇప్పుడు ఇంకో రెండు స్పూన్ల నెయ్యి వేసి, యాలకుల పొడి, కర్పూరం, వేసి బాగా కలుపుకుని, స్టవ్ ఆఫ్ చేసుకోండి.
12. అంతే వేడి వేడి చక్కెర పొంగలి తయారు అయినట్లే..
Click Here To Follow Chaipakodi On Google News