Spectacle black spots:ముక్కు మీద కళ్ల అద్దాల మచ్చలు అలాగే ఉండిపోతున్నాయా? ఈ ఇంటి చిట్కాలను ట్రై చేయండి..
Spectacle black spots:ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ కళ్ళజోడు పెట్టుకొనే అవసరం ఏర్పడింది. రెగ్యులర్ గా కళ్ళజోడు పెట్టుకోవటం వలన ముక్కు మీద కళ్ల అద్దాల మచ్చలు ఏర్పడుతున్నాయి.
ఏ మచ్చలను తొలగించుకోవటానికి ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. దోసకాయ ముక్కలు పిగ్మెంటేషన్ ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చు. నల్లటి మచ్చ ఉన్న ముక్కుపై దోసకాయ ముక్కను పెట్టడం వల్ల ఈ మచ్చలు మాయమయ్యే అవకాశం ఉంది.
సహజంగానే నిమ్మకాయలో బ్లీచింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల నిమ్మరసం కళ్ళజోడు మచ్చలను తగ్గించటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది. నిమ్మరసం, నీరు లేదా తేనె మిశ్రమాన్ని నల్లటి మచ్చలపై పూయడం వల్ల ఈ మచ్చలను తొలగించవచ్చు.
ఈ సమస్యను సమర్ధవంతంగా పరిష్కరించటంలో తేనే సహాయపడుతుంది. నల్లని మార్కులపై తేనెను రాసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. ప్రతి రోజు క్రమం తప్పకుండా కళ్ళజోడు నల్లని మార్కులపై రాస్తూ ఉంటే క్రమంగా తగ్గిపోతాయి.
బంగాళదుంపలో కూడా బ్లీచింగ్ కాంపౌండ్స్ ఉన్నాయి. అందువలన కళ్ళజోడు నల్లని మచ్చలను తొలగించటంలో సహాయపడుతుంది. అలాగే, నారింజ తొక్కల పొడి కళ్ళజోడు మచ్చలను సమర్థవంతంగా తొలగిస్తుంది.
నారింజ తొక్కల పొడిలో కొంచెం పాలను పోసి పేస్టుగా చేయాలి. ఈ పేస్టుని ప్రభావిత ప్రాంతంలో రాసి 10 నిముషాల తర్వాత శుభ్రం చేసినట్టయితే ఫలితం కనిపిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News
https://www.chaipakodi.com/

