Kitchenvantalu

Pesara Bellam Kudumulu:వినాయక చవితి స్పెషల్.. సరి కొత్త తీరులో పెసర బెల్లం కుడుములు సులభంగా చేసేయండి

Pesara Bellam Kudumulu: ఆవిరి పై చేసుకునే, ఏ వంటకం అయినా, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇడ్లీ, కుడుములు, లాంటి స్పెషల్స్, తరచూ చేస్తూనే ఉంటాం. వినాయకుడికి స్పెషల్ గా చేసుకునే, పెసర ఆవిరి కుడుములు, ఎప్పుడైనా టేస్ట్ చేసారా..లేదంటే ఈసారి ట్రై చేయండి.

కావాల్సిన పదార్ధాలు
స్టఫ్పింగ్ కోసం..
పెసలు – 1 కప్పు
కొబ్బరి తురుము – 1 కప్పు
బెల్లం తురుము – 1 కప్పు
యాలకుల పొడి – 1 టీ స్పూన్
బియ్యం పిండి – 1 కప్పు
ఉప్పు – చిటికెడు

తయారీ విధానం
1.స్టవ్ పై ఒక బాండీ పెట్టుకుని, పచ్చి పెసలనను, మంచి వాసన వచ్చేవరకు, దోరగా వేయించుకోవాలి.
2.పెసలు వేగాక అందులోకి, నీళ్లు పోసి, మీడియం ఫ్లేమ్ మీద, 5 విజిల్స్ వరకు, ఉడికించాలి.
3.ఉడికిన పప్పులో, బెల్లం, యాలకుల పొడి, కొబ్బరి తురుము, వేసుకుని, ముద్దగా అయ్యేవరకు ఉడకించాలి.
4. బాగా దగ్గర పడ్డాక, పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి.
5. ఇప్పుడు వేరొక గిన్నెలో బియ్యం పిండిలో ఉప్పు,నీళ్లు, వేసుకుని జారుగా కలుపుకోవాలి.

6. కలుపుకున్న పిండిని స్టవ్ పై పెట్టి, గట్టి ముద్ద అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి.
7. దగ్గరపడ్డాక, పిండిని పూర్తిగా చల్లారనివ్వాలి.
8. ఇప్పుడు ఎండిన విస్తరాకులను నీళ్లలో కలపి తీసుకోవాలి.
9. ఇప్పుడు ఆకు పైన నెయ్యిని రాస్తూ బియ్యం పిండిని చిన్న ముద్దగా చేసుకుని, పూరిలా చేతులతో ప్రెస్ చేసుకోవాలి.
10. ప్రెస్ చేసిన పూరి మధ్యలో పప్పు ముద్దును పెట్టుకుని, ఆకును ఒక వైను రెండో వైపుకు మలుచుకుని పొట్లంలా ఫోల్డ్ చేయాలి.
11. తయారు చేసుకున్న ఈ పొట్లాలను ఇడ్లీ కుక్కర్ లో పెట్టి , హై ఫ్లేమ్ పైన రెండు నిముషాలు, లో ఫ్లేమ్ పై నాలుగు నిముషాలు ఉడికించాలి.
12. ఉడికిన తర్వాత, ఆకులను వేరు చేసి, కుడుములను పక్కకు తీసుకోవాలి.
13. అంతే ఉడికిన పెసర ఆవిరి కుడుములను నెయ్యితో సెర్వ్ చేసుకోవడమే..
Click Here To Follow Chaipakodi On Google News