Healthhealth tips in telugu

Reduce Cholesterol Levels : శరీరంలో కొలెస్ట్రాల్ స్ధాయిలు తగ్గించుకోవాలంటే ?

Reduce Cholesterol Levels :కొలెస్ట్రాల్….. ఈ మాట వినగానే చాల మంది చలి జ్వరం వచ్చినట్లు వణికి పోతూ ఉంటారు. ఎన్నో ఆరోగ్య సమస్యలకు కారణమైన దీన్ని తగ్గించుకోవటానికి రకరకాల పద్దతులను పాటిస్తూ ఉంటారు. కొంత మంది మందులను కూడా వాడుతూ ఉంటారు. అలాంటి పద్దతులు ఏమి లేకుండా కొలెస్ట్రాల్ తగ్గించుకోవటానికి చిట్కాలను తెలిసికుందాం.

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని ఒక సామెత ఉంది. కొలస్ట్రాల్ తగ్గించుకోవటానికి ఉల్లి ఎంతగానో దోహదపడుతుంది. ప్రతి రోజు ఒక చిన్న గ్లాస్ ఉల్లి రసం త్రాగితే రక్తం సుద్ది అవుతుంది. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాక కొలస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది.

కొలస్ట్రాల్ అధికంగా ఉన్నవారు ప్రతి రోజు ఎనిమిది,పది గ్లాసుల నీరు త్రాగాలి. ఎక్కువగా నీరు త్రాగటం వలన మూత్రపిండాల పనితీరు మెరుగుపడి కొలస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

ప్రతి రోజు పది నిముషాలు హిప్ బాత్ చేస్తే మంచి పలితం కనపడుతుంది. పద్మాసనం,వజ్రాసనం చేయుట వలన కూడా కొలస్ట్రాల్ తగ్గుతుంది.

కొత్తిమీర రసం ను ప్రతి రోజు త్రాగితే మంచి పలితం కనపడుతుంది. అలాగే ఒక గ్లాస్ నీటిలో రెండు స్పూన్స్ దనియాలు వేసి మరిగించి,వడకట్టి ఆ నీటిని త్రాగిన మంచి ప్రయోజనం ఉంటుంది.

బాదంపప్పులు కూడా కొలస్ట్రాల్ ను తగ్గించటంలో బాగా సహాయం చేస్తాయి. ప్రతి రోజు 10 బాదంపప్పులను నీటిలో నానబెట్టి తీసుకుంటే క్రమేపి కొలస్ట్రాల్ తగ్గుతుంది.

గుడ్డు,చీజ్,వెన్న,మాంసం,కొవ్వు తీయని పాలు,వేపుడు కూరలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. వెల్లుల్లిని ఆహార పదార్దాల తయారీలో సాధ్యమైనంత ఎక్కువగా వాడితే కొలస్ట్రాల్ తగ్గుతుంది.

చిన్నగా ఉన్న దాల్చిన చెక్క ముక్కలను 10 తీసుకోని వాటిని ఐదు కప్పుల నీటిలో వేసి బాగా మరిగించాలి. అనంతరం ఈ నీటిని వడకట్టి అందులో ఒక స్పూన్ కలిపి తీసుకుంటే కొలస్ట్రాల్ తగ్గించటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News