Face Glow Tips:మీది ఎలాంటి చర్మమైనా సరే.. కాఫీ ఫేస్ మాస్క్ తో తెల్లగా మెరవాల్సిందే
Coffee Face Glow Tips: ముఖం మీద నల్లని మచ్చలు, మొటిమలు లేకుండా తెల్లగా కాంతివంతంగా మెరవాలంటే పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. అలాగే బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగవలసిన అవసరం కూడా లేదు.
మన ఇంటిలో దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా తక్కువ ఖర్చుతో చాలా సులభంగా ముఖం మెరిసేలా చేసుకోవచ్చు. ఈ చిట్కాలో కాఫీ పొడి,పసుపు,పాలు వంటి మూడు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం.
ఒక బౌల్ లో ఒక స్పూన్ కాఫీ పొడి,అరస్పూన్ పసుపు, రెండు స్పూన్ల పాలు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 5 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.
ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది. పసుపు,కాఫీ పొడిలో ఉన్న యాంటీఆక్సిడెంట్స్ ఉండుట వలన తక్షణ ప్రకాశాన్ని మరియు మెరుపును అందిస్తుంది.
పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ-మైక్రోబయల్ లక్షణాలు ఉండుట వలన పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది. వృద్ధాప్య సంకేతాలను ఎదుర్కోవడం మరియు చర్మ స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది.
పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ ఎరుపు మరియు ఇతర రకాల మచ్చలను తొలగించటమే కాకుండా మంటను కూడా తగ్గిస్తుంది. కాబట్టి ఈ ప్యాక్ వేసుకొని అందమైన తెల్లని ముఖాన్ని సొంతం చేసుకోండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News