Healthhealth tips in telugu

Bay Leaf Benefits For Health:ఈ ఆకును మరిగించి తాగితే ఎన్ని స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చో తెలుసా..?

Bay Leaf Benefits: బిర్యానీ ఆకుని ఇంగ్లిష్ లో బే లీఫ్ అంటారు. సాధారణంగా బిర్యానీ ఆకును వంటల్లో వేస్తే రుచితో పాటు మంచి సువాసనను ఇస్తుంది. మ‌సాలా వంట‌కాల్లో మ‌సాలా దినుసుల‌తో పాటు బిర్యానీ ఆకు వాడ‌టం అంద‌రికీ అల‌వాటు.ముఖ్యంగా బిర్యానీ ఆకును బిర్యానీ, నాన్ వెజ్ వంటల్లో ఎక్కువగా వేస్తారు.

ప్రస్తుతం బిర్యానీ ఆకును వంటల్లోనే కాకుండా ఔషదాల తయారీలోనూ ఉపయోగిస్తున్నారు. బిర్యానీ ఆకులు మనకు ఆరోగ్యాన్ని,అందాన్ని సంరక్షణ విషయంలోనూ బాగా సహాయపడుతుంది. బిర్యానీ ఆకులో విట‌మిన్ బి, పాంటోధెనిక్ ఆమ్లం, ఫైరాడిక్సిన్, రైబో ఫ్లేవిన్ సమృద్ధిగా ఉండుట వలన శ‌రీరంలోని ఎంజైముల ప‌నితీరుని మెరుగుప‌రుస్తాయి.

అలాగే నాడీవ్య‌వ‌స్థ ప‌నితీరు, జీవ‌క్రియ‌ల‌ను మెరుగుప‌ర‌చ‌డంలో కూడా బిర్యానీ ఆకు స‌హాయ‌ప‌డుతుంది. బిర్యానీ ఆకులో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో, ప్ర‌స‌వానంతరం క‌డుపులో బిడ్డ‌కి, గ‌ర్బిణీ స్ర్తీకి ఫోలిక్ యాసిడ్ చాలా అవ‌స‌రం. కాబ‌ట్టి గ‌ర్భిణీలు వంట‌కాల్లో బిర్యానీ ఆకు చేర్చుకోవ‌డం చాలా అవ‌స‌రం.

బిర్యానీ ఆకులో విటమిన్ ఏ ఉండుట వలన కంటి సమస్యలు రాకుండా చేస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన చర్మ ఆరోగ్యానికి సహాయపడుతుంది. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నప్పుడు బిర్యానీ ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని రోజు క్రమం తప్పకుండా త్రాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి.

జలుబు,దగ్గు సమస్యలు ఉన్నప్పుడు బిర్యానీ ఆకులను నీటిలో వేసి మరిగించి ఆవిరి పీల్చితే త్వరగా దగ్గు,జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది. ఒక గ్లాస్ నీటిలో పావు స్పూన్ బిర్యానీ ఆకుల పొడిని కలిపి తీసుకుంటే జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News