Kitchenvantalu

Banana Chivada:అరటికాయతో ఇలా చేస్తే ఆలూ కంటే పది రేట్లు కరకరలాడే చివడా..

Raw Banana Chivada: అప్పటికప్పుడు చేసే అరటి కాయ కూర,ఫ్రై,బజ్జీలే కాకుండా అరటి తరుగుతో చివడ స్నాక్స్ చేసేసుకోండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.

కావాల్సిన పదార్ధాలు
పచ్చి అరటి కాయలు – 3
నూనె – ఫ్రై కి సరిపడా
ఉప్పు – 3-4 టేబుల్ స్పూన్
పసుపు – 1 టేబుల్ స్పూన్
నీళ్లు – ¼ కప్పు
కరివేపాకు – 4 రెమ్మలు
ఎండుమిర్చి – 3-4
జీడిపప్పు – గుప్పెడు
బాదాం – కొద్దిగా
కిస్మిస్ – 3 టేబుల్ స్పూన్స్
కారం – 1 టేబుల్ స్పూన్
మిరియాల పొడి – కొద్దిగా
చాట్ మసాలా – ½ టేబుల్ స్పూన్

తయారీ విధానం
1.అరటి కాయ ముక్కలు కోసి చెక్కుతీసి పక్కనుంచుకోవాలి.
2.నీళ్లలో ఉప్పు,పసుపు,వేసి కలిపి పెట్టుకోవాలి.
3.నూనె లో జీడిపప్పు ,బాదాం ,కిస్మిస్ విడివిడి గా వేపుకోని పక్కనుంచుకోండి.
4.బాగా వేడెక్కిన నూనెలో అరటి కాయలను తురిముకోవాలి.

5.అరటికాయ తురుముని జల్లిగరిట సాయంతో విడి విడిగా నూనెలో స్ప్రెడ్ చేసుకోవాలి.
6.అప్పుడు పసుపు,ఉప్పుకలుపుకున్న నీళ్లను ఒక చెంచా పోసి నెమ్మదిగా వేపుకోవాలి.
7.అరటికాయ విడివిడిగా అయ్యాక హై ఫ్లేమ్ పై ఎర్రగా వేపి జల్లెడ లో వేసి వదిలేయాలి.
8.అరటికాయ వేపుకున్నాక ఎండుమిర్చి,కరివేపాకు వేసి నూనె తీసి పక్కన పెట్టుకోవాలి.
9.చల్లారిన అరిటికాయ చివడా కర కరలాడుతున్నప్పుడు అందులోకి డ్రై ఫ్రూట్స్,చాట్ మసాలా,కారంవేసి ఎగరేస్తు అంతటా పట్టేలా టాస్ చేసుకోవాలి.
10.ఎయిర్ టైట్ కంటేనర్ లో స్టోర్ చేసి పెట్టుకుంటే రెండు వారాల వరకు ఫ్రెష్ గా ఉంటాయి.
Click Here To Follow Chaipakodi On Google News