Kitchenvantalu

Kanda Kodiguddu Pulusu:తెలుగు వారు మరిచిపోయిన కంద కోడిగుడ్డు పులుసు.. రుచి అదిరిపోతుంది

Kanda Kodiguddu Pulusu: ఉడకపెట్టిన గుడ్లతో చిక్కని పులుసు పెట్టుకోని ,కంద గడ్డ యాడ్ చేసుకున్నారంటే పులుసు కూర అదిరి పోతుంది.

కావాల్సిన పదార్ధాలు
కంద – 300 గ్రాములు
ఉడికించిన కోడి గుడ్లు – 5
మసాలా పేస్ట్ కోసం..
నూనె – 3 టేబుల్ స్పూన్
దాల్చిన చెక్క – 1.5 ఇంచ్
లవంగాలు – 3
యాలకులు – 2
ఎండు కొబ్బరి – ¼ కప్పు
అల్లం – చిన్న ముక్క
వెల్లుల్లి – 8
ధనియాలు -1 టేబుల్ స్పూన్
నువ్వులు – 1 టేబుల్ స్పూన్
గసగసాలు – ½ టేబుల్ స్పూన్

పులుసు కోసం..
నూనె – 3 టేబుల్ స్పూన్
ఉల్లిపాయ తరుగు – 1 కప్పు
సాంబార్ ఉల్లిపాయలు – 10-12
పచ్చిమిర్చి – 2
కరివేపాకు – 2 రెమ్మలు
ఉప్పు – రుచికి సరిపడా
పసుపు – ¼ టీ స్పూన్
కారం – ½ టేబుల్ స్పూన్
చింతపండు పులుసు – 3 టేబుల్ స్పూన్
బెల్లం – 1 టేబుల్ స్పూన్
కొత్తిమీర – కొద్దిగా
గరం మసాలా – ¼ టీ స్పూన్
నీళ్లు – 2 కప్పులు

తయారీ విధానం
1.చేతులకి నూనె రాసుకుని కందగడ్డని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకోని,పసుపు,ఉప్పు వేసిన నీళ్లలో కడిగి పక్కన పెట్టుకోవాలి.
2.కుక్కర్లో కంద ముక్కలు,పసుపు వేసి మునిగే వరకు నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
3.స్టవ్ పై కడాయి పెట్టుకోని నూనె వేడి చేసి అందులోకి ఉడికించుకున్న గుడ్లకు గాట్లు పెట్టుకోని కొద్దిగా పసుపు వేసి వేపుకోని పక్కనపెట్టుకోవాలి.
4.మిగిలిన నూనెలో మసాలా పేస్ట్ కోసం తీసుకున్న పదార్ధాలను వేసుకోని లో ఫ్లేమ్ పై వేపుకోని కొద్దిగా నీళ్లు వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి.
5.నూనె వేడిచేసి అందులో ఉల్లిపాయ తరుగు ,సాంబార్ ఉల్లిపాయలు ,ఉప్పు,పచ్చిమిర్చి ,కరివేపాకు వేసి వేపుకోవాలి.

6.ఉల్లిపాయ మెత్తబడ్డాక తర్వాత కంద ముక్కలు ,ఉప్పు ,కారం ,పసుపు వేసి ముక్కలు చిదిమకుండా 2 నిమిషాలు వేపుకోవాలి.
7.తర్వాత అందులోకి మసాలా పేస్ట్, నీళ్లు ,చింతపండు పులుసు పోసి రెండు పొంగులు రానివ్వాలి.
8.పులుసు మరుగుతున్న సమయంలో ఉడికించి వేపిన గుడ్లు,బెల్లం వేసి నూనె పైకి తేలేవరకు మరింగాలి.
9.చివరగా గరం మాసాలా,కొత్తిమీర తరుగు వేసి కలుపుకోని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
10.అంతే కమ్మని కంద గడ్డ,కోడి గుడ్డు పులుసు రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News