Kitchenvantalu

Spinach Vada:పాలకూరతో వడలు ఇలా ఒకసారి చేసి చూడండి.. తింటే వదిలిపెట్టరు

Spinach Vada: శనగపప్పు,పాలకూర కాంబినేషన్ తో తయారు చేసే కీరయ్ వడ రుచిలో అదిరిపోతుంది. ఎప్పుడు తినే మినపవడలకు బదులుగా ఈ కీరయ్ వడ ట్రై చేసి చూడండి.

కావాల్సిన పదార్ధాలు
శనగపప్పు – ½ కప్పు
కందిపప్పు – 2 టేబుల్ స్పూన్స్
బియ్యం – 1 టేబుల్ స్పూన్
పాలకూర – 1 కప్పు
కొత్తిమీర తరుగు – కొద్దిగా
కరివేపాకు తరుగు – పిడికెడు
పచ్చిమిర్చి – 2
అల్లం తరుగు – 1 ఇంచ్
సోంపు – 1 స్పూన్
ఇంగువ – 1 చిటికెడు
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
ఉప్పు – రుచికి సరిపడా

తయారీ విధానం
1.ముందుగా శనగపప్పు,కందిపప్పు,బియ్యాన్ని గంట పాటు నానబెట్టుకోవాలి.
2.నానిన పప్పులను వడగట్టుకోని పక్కన పెట్టుకోవాలి.
3.నానిన పప్పును మిక్సిగిన్నెలో వేసుకోని అందులోకి పచ్చిమిర్చి,కొత్తిమీర,అల్లం తరుగు,ఉప్పు,సోంపులు,అన్ని పదార్ధాలను వేసుకోని బరకగా గ్రైండ్ చేసుకోవాలి.

4.గ్రైండ్ చేసుకున్న పిండిలో పాలకూర,కరివేపాకు వేసి కలుపుకోవాలి.
5.చేతులను తడిచేసుకోని కొద్ది కొద్దిగా పిండి తీసుకోని వడలుగా వత్తుకోవాలి.
6.వత్తుకున్న వడలను వేడిచేసుకున్న నూనెలో వేసి మీడియం ఫ్లేమ్ పై ఎర్రగా కాల్చుకోని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే.
Click Here To Follow Chaipakodi On Google News