Jaggery Malpua:ఈ టిప్స్ తో మాల్ పువా చేస్తే.. మొదటి సారి చేసినా చాలా బాగా వస్తాయి
Jaggery Malpua:ఈ టిప్స్ తో మాల్ పువా చేస్తే.. మొదటి సారి చేసినా చాలా బాగా వస్తాయి. రాజస్తానీ ఫేమస్ స్వీట్ రెసిపీ, బెల్లం మాల్ పువా..అదెలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
మైదా -1 కప్పు
బెల్లం – 1/2కప్పు
యాలకుల పొడి – చిటికెడు
సోంపు – చిటికెడు
నెయ్యి – ఫ్రైకి సరిపడా
బాదం పిస్తా – గార్నిష్ కోసం..
తయారీ విధానం –
1.ఒక మిక్సింగ్ బౌల్ లో మైదా, బెల్లం, యాలకుల పొడి, సోంపు వేసుకుని, మిక్స్ చేసుకోవాలి.
2.అందులోకి కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేస్తూ, ఉండలు లేకుండా, పిండిని కొంచెం చిక్కగా కలుపుకోవాలి.
3.స్టవ్ పై పాన్ పెట్టుకుని, నెయ్యి వేసి, గరిటెడు పిండిని నెయ్యి పై వేసి, కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి.
4.ఒక వైపు కాలిన తర్వాత,మరో వైపు టర్న్ చేసుకుని ఎర్రగా కాల్చుకోవాలి.
5.కాలిన మాల్ పువాను తీసుకుని, దాని పై, బాదం, పిస్తాతో గార్నిష్ చేసుకోవాలి.
6.అంతే బెల్లం మాల్ పువా తయారైనట్లే.
Click Here To Follow Chaipakodi On Google News

