Kitchenvantalu

Shankarpali:శంకర్ పాళి ఇలా చేస్తే గుల్లగా కరకరలాడుతూ.. క్రిప్సి గా నెలరోజులు తినేయచ్చు

Shankarpali: పిల్లలైన పెద్దలైనా సాయంత్రం అయ్యిందంటే చిరుతిండి కోసం వంటింట్లో వెతకడం మొదలు పెడ్తారు. అలా చిరుతిల్లు ఇష్టపడే వాల్ల కోసం శంకరపాలి తయారు చేసి పెట్టండి.

కావాల్సిన పదార్ధాలు
మైదా – 2 కప్పులు
నీళ్లు – 2 కప్పులు
చక్కెర పొడి – ½ కప్పు
నెయ్యి – ½ కప్పు
బేకింగ్ సోడా – చిటికెడు
నూనె – ఫ్రైకి సరిపడా
తయారీ విధానం

1.మిక్సింగ్ బౌల్ లోకి కప్పు నీళ్లు తీసుకోని అందులోకి చక్కెర పొడి వేసి బాగా కలుపుకోవాలి.
2.అందులోకి కరిగించిన నెయ్యి వేసి ½ టీ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి.
3.కలుపుకున్న నీటిలోకి మైదా పిండి,బేకింగ్ సోడా వేసుకోని కలుపుకోవాలి.
4.కలుపుకున్న పిండి ముద్దను కాసేపు పక్కన పెట్టుకోవాలి.

5. పదిహేను నిమిషాల తర్వాత పిండి ముద్దను చపాతిలుగా వత్తుకోవాలి.
6.చపాతిలో ఇష్ట మైనా షేప్స్ లో కట్ చేసుకోవాలి.
7.స్టవ్ పై బాండీ పెట్టుకోని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసి అందులోకి కట్ చేసుకున్న పిండిని వేసుకోవాలి.
8.అన్ని వైపుల తిప్పుతు ఎర్రగా వేయించుకోని చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటేనర్ లో స్టోర్ చేసుకుంటే రెండు వారాల వరకు ఫ్రెష్ గా ఉంటాయి.