Barley water:రోజు పరగడుపున ఈ నీటిని తాగితే ఎన్ని లాభాలు కలుగుతాయో తెలుసా?
Barley water Benefits in Telugu : పూర్వ కాలంలో బార్లీ గింజలను ఎక్కువగా వాడేవారు. ప్రస్తుత పరిస్థితిలో మార్పుల కారణంగా ఇప్పటి రోజుల్లో కూడా బార్లీ గింజల వాడకం బాగా పెరిగింది. బార్లీ గింజలు చూడటానికి గోదుమలను పోలి ఉంటాయి. అయితే గోదుమలు కన్నా బార్లీ గింజలలో ఎన్నో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
బార్లీ నీటిని ప్రతి రోజు తాగితే శరీరంలో వ్యర్ధాలు అన్నీ తొలగిపోయి పెద్దప్రేగు శుభ్రపడుతుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. కడుపులో గ్యాస్,కడుపు ఉబ్బరం,కడుపు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది. డయబెటిస్ ఉన్నవారు ప్రతి రోజు తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండటమే కాకుండా డయబెటిస్ కారణంగా వచ్చే నీరసం,అలసట వంటివి లేకుండా చేస్తుంది.
మూత్ర సంబంద సమస్యలు లేకుండా చేస్తుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ లేకుండా చేయటమే కాకుండా మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. అలాగే రక్తప్రసరణ బాగా జరిగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. దాంతో గుండెకు సంబందించిన సమస్యలు ఉండవు. అధిక బరువుతో బాధపడేవారు ఉదయం,సాయంత్రం బార్లీ నీటిని తీసుకుంటే మంచి ప్రయోజనం కనపడుతుంది.
బార్లీ నీటిని ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం. పొయ్యి మీద గిన్నె పెట్టి రెండు గ్లాసుల నీటిని పోసి రెండు స్పూన్ల బార్లీ గింజలను వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. మరిగిన ఈ నీటిని గ్లాస్ లోకి వడకట్టి దానిలో ఒక స్పూన్ నిమ్మరసం, అరస్పూన్ తేనె కలిపి తాగాలి. డయబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి.
సమస్యలు ఉన్నప్పుడు ప్రతి రోజు తాగితే మంచిది. సమస్యలు ఏమి లేని వారు వారంలో రెండు సార్లు బార్లీ నీటిని తాగితే మంచి పలితాలను పొందవచ్చు. బార్లీ గింజలు కూడా అందరికి అందుబాటు ధరలో చాలా సులభంగా దొరుకుతాయి. అలాగే సంవత్సరం పొడవునా విరివిగా లభ్యం అవుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.