Kitchenvantalu

Vegetable Buns:బయట కొనే బదులు ఇంట్లో ఇలా ఈజీగా చేసి పెట్టండి.. దూది లాంటి బన్..

Vegetable Buns: మారుతున్న జనేరేషన్ లో ఫుడ్ లో కూడ వెరైటీస్ కోరుకుంటున్నారు. పిల్లల విషయంలో స్పెషల్ గా అనిపిస్తే తప్పా టేస్ట్ కూడ చెయ్యరు. కిడ్స్ కోసం వెరైటీ వెజిటెబుల్ బన్స్ చేసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
చక్కెర – 2 టేబుల్ స్పూన్స్
ఈస్ట్ – 1 ½ టేబుల్స్ స్పూన్
మైదా – 1 కప్పు
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – తగినంత
అల్లం తరుగు – 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి – 1 టేబుల్ స్పూన్
ఉల్లిపాయ తరుగు – 1 టేబుల్ స్పూన్
క్యాప్సికమ్ తరుగు – 1 టేబుల్ స్పూన్
క్యారెట్ తరుగు – 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి – 2-3
చిల్లి సాస్ – ½ టేబుల్ స్పూన్
టోమాటో స్పూన్ – 1 టేబుల్ స్పూన్
సోయా సాస్ – 1 టేబుల్ స్పూన్
కొత్తిమీర – ¼ కప్పు
నువ్వులు – 1 టేబుల్ స్పూన్
బటర్ – 2 టేబుల్ స్పూన్స్
చీజ్ – తగినంత

తయారీ విధానం
1.ఒక గిన్నెలో చక్కెర ,ఈస్ట్ కలుపుకోని గోరు వెచ్చని పాలతో మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2.ఇప్పుడు మిక్సింగ్ బౌల్ లోకి రెండు కప్పుల మైదా,ఉప్పు,కలుపుకోని అందులోకి ఈస్ట్ మిశ్రమాన్ని కలిపి తగినన్ని పాలను కలుపూతు పిండిని ముద్దగా చేసుకోవాలి.
3.మెత్తగా కలుపుకున్న పిండిలో నూనె వేసి పూర్తిగా అప్లైచేసుకోని క్లాత్ లేదా మూత పెట్టి గంట పాటు పక్కన పెట్టుకోవాలి.
4.ఇప్పుడు స్టఫ్ కోసం ప్యాన్ వేడి చేసి నూనె వేసి తరిగిన వెల్లుల్లి, అల్లం,ఉల్లిపాయలు వేసి వేపుకోవాలి.
5.ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులోకి క్యారెట్,క్యాప్సికం,బఠానీలు,సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి మూతపెట్టుకోని మెత్తగా మగ్గనివ్వాలి.
5.వెజిటెబుల్స్ లోకి టోమాటో సాస్,చిల్లి సాస్ ,సోయా సాస్ యాడ్ చేసుకోని స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర తరుగు చల్లుకోని చల్లారనివ్వాలి.

6.ఇప్పుడు పక్కన పెట్టుకున్న పిండిని మళ్లీ బాగా కలుపుకోవాలి.
7.కలుపుకున్న పిండిని చిన్న ముద్దలుగా తీసుకోని అరచేతిలో వత్తుకోని మద్యలో తయారు చేసుకున్న వెజిటెబుల్ స్టఫ్ ను వేసి కొద్దిగా చీజ్ ను జోడించి అంచులను క్లోజ్ చేసుకోని ఇడ్లీ షేప్ లో వత్తుకోవాలి.
8.ఇడ్లీ ప్లేట్స్ పై నూనె కాని నెయ్యి కాని రాసుకోని తయారు చేసుకున్న బన్నులను కిచెన్ క్లాత్ లో వేసి పదిహేను నుండి ఇరువై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
9.తర్వాత అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకోని అందులో స్టాండ్ ను అమర్చుకోని తయారు చేసుకున్న బన్స్ ను పాలతో తడుపుకోవాలి.
10.ఇప్పుడు ఇడ్లీ పై నువ్వులను చల్లుకోని బేక్ చేయడం కోసం గిన్నె అడుగులో పెట్టి ముప్పై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పై బేక్ చేసుకోవలి.
11.ఒక సారి చెక్ చేసుకోని బన్స్ పై బటర్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
12.రెడీ అయిన బన్స్ పై తడి క్లాత్ ను వేసుకోవాలి.
13.అంతే టేస్టీ టేస్టీ వెజ్ బన్స్ రెడీ.