Mango Cake Recipe:ఓవెన్, వెన్న, క్రీమ్, కండెన్స్ పాలు, వెన్న, పెరుగు లేకుండా Eggless Mango Cake
Mango cake Recipe: స్పెషల్ ఏదైనా సరే కేక్ కటింగ్ కంపల్సరీ అయిపోయింది. ప్రతిసారీ బేకరీ కేక్స్ కాకుండా చిన్న చిన్న అకేషన్స్ కి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సీజన్ లో దొరికే మ్యాగోస్ తో కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
మామిడి పండు – 1
బొంబాయి రవ్వ – 1 కప్పు
పాలు – 1 కప్పు
చక్కెర పొడి – ½ కప్పు
యాలకులు- 3-4
బేకింగి సోడా – ½ టేబుల్ స్పూన్
బేకింగ్ పౌడర్ – 1 టేబుల్ స్పూన్
తయరీ విధానం
1.ముందుగా మామిడిపండుని తొక్క తీసి చిన్నముక్కలుగా కట్ చేసుకోని మిక్సిజార్ లో వేసి ప్యూరి సిధ్ద చేసుకోవాలి.
2.మిక్సింగ్ బౌల్ లోకి కప్పు బొంబాయి రవ్వ,1/2 కప్పు చక్కెర వేసి ఉండలు లేకుండ కలుపుకోవాలి.
3.ఇప్పుడు అందులోకి మ్యాంగో ప్యూరీని,యాలకులు పొడిని ,కప్పు పాలను ,2 టేబుల్ స్పూన్స్ బటర్ ను కూడ వేసి కలుపుకోవాలి.
4.కలుపుకున్న మిశ్రమాన్ని ఇరువై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
5.ఇప్పుడు కేక్ కోసం స్టీల్,లేదా ,అల్యూమినియం గిన్నెను తీసుకోని అడుగున మరియు సైడ్స్ వరకు కరిగించిన బటర్ ను అప్లై చేయాలి.
6.కాస్త పొడిపిండిని చల్లుకోవాలి.
7.కేక్ ను బేక్ చేయడం కోసం మందపాటి ప్యాన్ తీసుకోవాలి.
8.గిన్నెను ముందుగా పది నిమిషాలు వేడి చేసిపెట్టాలి.
9.ఇప్పుడు కలుపుకున్న పిండి లో మిగిలిన కప్పు పాలు,బేకింగ్ సోడా,బేకింగ్ పౌడర్ ను వేసి పిండి కలుపుకోవాలి.
10.బటర్ రాసి పెట్టిన కేక్ బౌల్ లోకి కేక్ మిశ్రమాన్ని పోసుకోవాలి.గిన్నెలో సగం వరకు ఉండేలా చూసుకోవాలి.
11.ఇప్పుడు వేడిచేసుకున్న ప్యాన్ పై స్టాడ్ పెట్టుకోని కేక్ ప్యాన్ ని స్టాండ్ పై అమర్చుకోవాలి.
12.మూత పెట్టుకోని లో ఫ్లేమ్ పై ముప్పై నుంచి ముప్పై ఐదు నిమిషాలా బేక్ చేసుకోవాలి.
13.ఇంత లోపు గ్లేజింగ్ం కోసం ప్యాన్ వేడి చేసి అందులో మ్యాగో ప్యూరీ,పావు కప్పు పంచదార ,కప్పు నీళ్లు వేసి పది నిమిషాల పాటు కలుపుతు ఉడకనివ్వాలి.
14.అది చల్లారాక ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.
15.ఇప్పుడు బేక్ చేసుకున్న కేక్ ను టూత్ పిక్ సాయంతో చెక్ చేసుకోని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
16.కేక్ బౌల్ అంచులను కత్తితో వదిలించి వేరొక ప్లేట్ లోకి బొర్లించుకోవాలి.
17.ఇప్పుడు గ్లేజింగ్ కోసం సిద్ద చేసుకున్న మిశ్రమంతో గ్లేజ్ చేసి ఇష్టమైన విధంగా టాపింగ్ చేసుకుంటే మ్యాంగో కేక్ రెడీ.


