Healthhealth tips in telugu

Health Care: ఈ మొక్క ఒకటి ఉంటే చాలు.. ఆస్పత్రికి వెళ్లాల్సిన పనిలేదు.. అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు!

Parijatha flowers:ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ దాదాపుగా పారిజాతం మొక్కను ఇంటిలో పెంచుకుంటున్నారు. పారిజాతం పూలను దేవుని పూజకు వాడుతూ ఉంటారు. పారిజాతం ఆకు,పువ్వు,వేరు,కాండం ఇలా ఈ మొక్కలో అన్నీ బాగాలను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉప యోగిస్తారు. రెండు పారిజాతం ఆకులను తీసుకొని శుభ్రంగా కడగాలి.

పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి కడిగిన పారిజాతం ఆకులను ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి మూడు నిమిషాల పాటు మరిగిస్తే ఆ ఆకులోని పోషకాలు నీటిలోకి చేరతాయి. ఈ నీటిని వడకట్టి ఉదయం సమయంలో తాగాలి. ఈ విధంగా తాగటం వలన కండరాల నొప్పులు, కండరాల తిమ్మిరి, మజిల్ క్రాంప్స్ తగ్గుతాయి.

అలాగే ఈ నీటిని తాగటం వలన డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. అలాగే అజీర్ణం,గ్యాస్,మలబద్దకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ నీటిని తాగటానికి అరగంట ముందు ఏమి తీసుకోకుండా ఉంటే మంచిది. పారిజాతం ఆకులు ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది.

పారిజాతం ఆకులను ఎండబెట్టి పొడిగా చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఆ పొడిని కూడా వాడవచ్చు. పారిజాత మొక్క ఆకుల్లో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. షుగర్ పేషెంట్లు ఈ మొక్క ఆకుల రసాన్ని నీటిలో వేసి వేడి చేయాలి. ఈ డ్రింక్‌ను ఉదయాన్నే తాగితే, బ్లడ్ షుగర్‌ను చాలా వరకు కంట్రోల్ చేస్తుంది.

సయాటికా (Sciatica) అనేది డిస్క్‌లకు వచ్చే ఎముకల వ్యాధి. దీని నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఆయుర్వేదంలో ఎక్కువగా వాడే ఈ మొక్కను ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.