Healthhealth tips in telugu

Shankhpushpi : నీలి రంగు శంకు పువ్వు దేవుని పూజలోనే కాదు.. ఊహించని ఎన్నో ప్రయోజనాలు

Shankhpushpi benefits:మారిన జీవనశైలి కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలన్నా, వచ్చిన సమస్యలు తగ్గాలన్నా మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. ఏ సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే శంఖుపూలతో తయారుచేసిన టీ తాగాలి.

శంఖుపూలను ఎక్కువగా శివుని ఆరాధనలో వాడతారు. ఈ పూలతో తయారుచేసిన టీని బ్లూ టీ అని పిలుస్తారు. ఈ టీని ప్రతి రోజు పరగడుపున తాగటం వలన అధిక బరువు సమస్య నుండి బయట పడవచ్చు. అలాగే డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా మంచిది.

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆందోళన,డిప్రెషన్ వంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది.

అయితే ఈ టీని ఎలా తయారుచేయాలో చూద్దాం. పొయ్యి వెలిగించి పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి కాస్త వేడి అయ్యాక 6 శంఖు పువ్వులు, 1 అంగుళం అల్లం ముక్క వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. ఈ నీటిని వడకట్టి ఒక స్పూన్ తేనే,ఒక స్పూన్ నిమ్మరసం కలిపి తాగాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Click Here To Follow Chaipakodi On Google News

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."