Kitchenvantalu

Potato Toffee:పిల్లలకి ఇష్టమైన ఆలూ స్నాక్స్.. కరకరలాడుతూ ఉంటాయి..

Potato Toffee : ఈవినింగ్ అయిదంటే చాలు ఏవో స్నాక్స్ కోసం ఎదురు చూస్తునే ఉంటారు. పిల్లలైనా,పెద్దవారైనా టీ తాగుతు కాసిన్ని స్నాక్స్ తినడం ఇష్టపడతారు. టీ టైం స్నాక్స్ గా ఆలు టోఫీ ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
బంగాళదుంపలు – 3
గోధుమ పిండి – 1 ½ కప్పు
బియ్యం పిండి – 3-4 టేబుల్ స్పూన్స్
అజోవాన్ – ½ టీస్పూన్
పచ్చిమిర్చి – 2
ధనియాల పొడి – ½ టీ స్పూన్
పసుపు – ¼ టీ స్పూన్
చాట్ మసాలా – ½ టీ స్పూన్

తయారీ విధానం
1.మిక్సింగ్ బౌల్ లోకి గోధుమ పిండి,అజోవాన్,ఉప్పు,నూనే వేసి తగినన్ని నీళ్లతో పిండిని మెత్తగా కలుపుకోవాలి.
2.ఇప్పుడు ఉడికించిన తొక్క తీసి పెట్టుకున్న బంగాళదుంపలోకి బియ్యం పిండి వేసి పచ్చిమిర్చి,ఉల్లిపాయలు, కొత్తిమీర,ఉప్పు ,ధనియాల పొడి ,పసుపు,చాట్ మసాలా వేసి కలుపుకోవాలి.
3.అందులోకి చింతపండు రసం వేసి కలుపుకోవాలి.
4.ఇప్పుడు కొద్దిగా ఆలు మిశ్రమాన్ని తీసుకోని బాల్స్ ల తయారు చేసుకోవాలి.
5.కొద్దిగా గోధుమ పిండిని తీసుకోని పూరీలా తాల్చుకుని అందులోకి స్టఫ్పింగ్ పెట్టు కోని అంచులను క్లోజ్ చేస్తు స్తూపాకారంలో తయారు చేసుకోని పక్కన పెట్టుకోవాలి.
6.తయారు చేసుకున్న టోపీ లను వేడి నూనే వేసుకోని డీప్ ఫ్రై చేసుకుంటే వేడి వేడి ఆలు టోఫీ రెడీ.