Kitchenvantalu

Millets Pesaratt: కొర్రలతో పెసరట్టు ఇలా చేస్తే.. ఇది ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్!

Millets Pesarattu: పుల్లట్టు ,మినపట్టు,పెసరట్టు రెగ్యులర్ టిఫిన్స్ లోకి చేస్తుంటాం. కాస్తా హెల్తీగా కావాలనుకుంటే మిల్లెట్స్ తో పెసరట్టు ట్రై చేయండి.

కావాల్సిన పదార్ధాలు
ఫాక్స్ టైల్ మిల్లెట్స్ (కొర్రలు) – 1 కప్పు
పెసలు – 1 కప్పు
అల్లం – కొద్దిగా
పచ్చిమిర్చి – 3
జీలకర్ర – 1 టీ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా

తయారీ విధానం
1.కొర్రలను,పెసలను కడిగి ఐదుగంటల పాటు నానబెట్టుకోవాలి.
2.నానిన తర్వాత మిక్సి జార్ లో వేసుకోని బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
3. ఇప్పుడు అందులోకి అల్లం,పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
4.గ్రైండ్ చేసుకున్న పిండిని వేరొక గిన్నెలో తీసుకోవాలి.

5.అందులోకి ఉప్పు ,జీలకర్ర వేసి బ్యాటర్ సిధ్దం చేసుకోవాలి.
6.ఇప్పుడు పెసరట్టుకోసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని వేడెక్కాకా గరిటడు బ్యాటర్ ని వేసి అట్టుని స్ప్రెడ్ చేసుకోవాలి.
7.పెసటరట్టుపై నూనె లేదా నెయ్యి అంచుల పై వేసి ఉల్లిపాయ,పచ్చిమిర్చి తరుగు చల్లుకోవాలి.
8.అట్టు బ్రౌన్ కలర్ లోకి మారాకా పెనం నుంచి తీసి ప్లేట్ లోకి వేసుకోవాలి.
9.అంతే వేడి వేడి మిల్లెట్స్ పెసరట్టు రెడీ.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."