Kitchenvantalu

Onion Pakodi:స్వీట్ షాప్ స్టైల్లో కరకరలాడే గట్టి పకోడీ ఒక్కసారి చేస్తే 15 రోజులు తినొచ్చు

Onion Pakodi:శనగ పిండి సరిపడని వారు బియ్యం పిండితో కూడ ఉల్లి పకోడి చేసుకోని ఎంజాయ్ చేయవచ్చు. రెగ్యులర్ గా శనగపిండి తినడం వల్ల వంట్లో వేడి చేస్తుంది .అప్పుడప్పుడు బియ్యం పిండితో ఉల్లి పకోడి ట్రై చేయండి.

కావాల్సిన పదార్ధాలు
బియ్యం పిండి – 1 కప్పు
ఉల్లిపాయలు – 2
పచ్చిమిర్చి – 3
జీలకర్ర – 1 టీ స్పూన్
కొత్తిమీర – కొద్దిగా
కరివేపాకు -3 రెబ్బలు
ఉప్పు – తగినంత

తయారీ విధానం
1.ముందుగా ఉల్లిపాయలను చీలికలు గా కట్ చేసుకోని అందులోకి ఉప్పు వేసి నీరు వదిలే వరకు ఉల్లిపాయలను గట్టిగా కలుపుకోవాలి.
2.ఇప్పుడు అందులోకి బియ్యం పిండిని వేసి ఉల్లిపాయ నీటితో పిండి కలిసిపోతుంది.లేదంటే కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకోవచ్చు.
3.ఇప్పుడు అందులోకి పచ్చమిర్చి,కరివేపాకు,జీలకర్ర వేసి పిండిని పొడి పొడిగా మాత్రమే కలుపుకోవాలి.మెత్తగా కావాలంటే కాస్త నీళ్లు యాడ్ చేసుకోవాలి.
4.పిండి కలుపుకున్నాక స్పూన్ ఆయిల్ వేసి కలుపుకోండి.
5.ఇప్పుడు డీప్ ఫ్రై కోసం కడాయి లోఆయిల్ వేడి చేసి కొద్ది కొద్దిగా పిండిని పకోడిలా వేసుకోవాలి.
6.తిప్పుతూ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు వేపుకుంటే క్రిస్పి అండ్ టేస్టీ ఉల్లి పకోడి రెడీ.