Kitchenvantalu

Instant Rasam Powder:2 నిమిషాల్లో రసం కావాలంటే ఇన్ స్టంట్ రసం పౌడర్ ఇలా తయారుచేసుకోండి

Instant Rasam Powder: కర్రీస్ తో సంబంధం లేకుండా భోజనం లోకి కంపల్సరీగా ఇష్టపడే రసం పొడిని ఇన్ స్టంట్ గా తయారు చేసుకోవచ్చు.

కావాల్సిన పదార్ధాలు
ధనియాలు – ½ కప్పు
చింతపండు – 50 గ్రాములు
ఎండు మిర్చి – 7-8
శనగ పప్పు – ¼ కప్పు
కంది పప్పు – ¼ కప్పు
మిరియాల పొడి – 2 స్పూన్స్
జీలకర్ర – 2 టీ స్పూన్స్
మెంతులు – 1 టీ స్పూన్
పసుపు – 1 టీ స్పూన్
కరివేపాకు – ½ టీ స్పూన్
ఉప్పు -3 టీ స్పూన్స్
ఇంగువ – ఆఫ్షనల్
ఆవాలు -1 టీ స్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
ఎండుమిర్చి – 3
కరివేపాకు – ½ కప్పు

తయారీ విధానం
1.ముందుగా అన్ని దినిసులనకు విడివిడిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి.
2. స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని పప్పులను మసాలా దినుసులను మాడి పోకుండా దోరగా వేపుకోని ప్లేట్ లోకి తీసుకోవాలి.
3.అలాగే చింతపండు కూడ తేమ లేకుండా వేపుకోవాలి.
4.వేపుకున్న పదార్ధాలన్ని మిక్సి జార లో తీసుకోని అందులోకి పసుపు యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

5.గ్రైండ్ చేసుకున్న పౌడర్ లో ఉప్పు కలుపుకోవాలి.
6.ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని ఆయిల్ వేడి చేసి అందులోకి ఆవాలు,జీలకర్ర ,ఎండుమిర్చి ,కరివేపాకు వేసి తాలింపును చల్లారనివ్వాలి.
7.చల్లారిని తాలింపును రసం పొడిలో కలుపుకోవాలి.
8.రెడీ చేసుకున్న ఈ రసం పొడిని ఎయిర్ టైట్ కంటేనర్ లో స్టోర్ చేసుకుంటే ఫ్రెష్ గా ఉంటుంది.