Kitchenvantalu

Sweet Corn Dosa:టిఫిన్, స్నాక్ గా కూడా ఈ విధంగా స్వీట్ కార్న్ దోశ.. ఆహ.. అంటూ తింటారు

Sweet Corn Dosa: ఎంతో ఈజీగా తయారుచేసుకునే హెల్తీ దోశ రెసిపీ స్వీట్ కార్న్ దోశ. రెగ్యులర్ గా చేసుకునే మినపప్పు తో స్వీట్ కార్న్ మిక్స్ చేసి దోశలు వేసుకున్నారంటే. టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది.హెల్తీ కూడ.

కావాల్సిన పదార్ధాలు
స్వీట్ కార్న్ – 2 కప్పలు
మినపప్పు – 1 కప్పు
బియ్యం – ¼ కప్పు
పచ్చిమిర్చి – 5-6
వెల్లుల్లి రెబ్బలు – 4-5
జీలకర్ర – 1 టీ స్పూన్
ఉప్పు – తగినంత

తయారీ విధానం
1.ముందుగా నానబెట్టుకున్న మినపప్పు,స్వీట్ కార్న్ ,బియ్యం,మిక్సీ జార్ లో తీసుకోవాలి.
2.అందులోకి పెసలు,జీలకర్ర ,వెల్లుల్లి రెబ్బలు,పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేసుకోని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
3.గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ ఫర్ చేసుకోని తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి.
4.అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకోవచ్చు.ఎక్కువ పల్చగా చెయ్యొద్దు.
5.దోశ ప్యాన్ స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని రెండు టీ స్పూన్స్ దోశ బ్యాటర్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి.
6. దోశ రెండు వైపులా దోరగా వేగినతర్వాత ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోవడమే.