Healthhealth tips in telugu

Ramphal Benefits:సీతాఫలం కంటే గింజలు తక్కువ, పోషకాలు ఎక్కువ.. రామాఫలంతో ప్రయోజనాలు ఇవే!

Ramphal Health Benefits In Telugu :మన చుట్టూ ఎన్నో రకాల పండ్లు ఉన్నా.. వాటి గురించి పెద్దగా పట్టించుకోము. వాటిలో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.

మనకు ఎన్నో రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. పండ్లను తింటే మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు అందుతాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. మనలో చాలా మందికి సీతాఫలం గురించి తెలుసు. కానీ రామాఫలం గురించి పెద్దగా చాలా మందికి తెలియదు.

హృదయాకారంలో, లేత ఎరుగు రంగులోను, ఆకు పచ్చ రంగులో ఉండే రామాఫలం సీతాఫల జాతికి చెందినది. సీతాఫలంతో పోలిస్తే రామఫలంలో గింజలు తక్కువగా ఉంటాయి. రామ ఫలంతో చేసిన రసం శరీరానికి తేజాన్ని ఇస్తుంది. ఇది ఇతర పండ్ల కంటే ఎక్కువ యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది.

పోషక విలువలు సమృద్ధిగా ఉన్న ఈ పండు చాలా రుచిగా ఉంటుంది. రామాఫలంను నెట్టెడ్‌ కస్టర్డ్‌ యాపిల్‌, బుల్లక్‌ హార్ట్‌, బుల్‌ హార్ట్‌ అని కూడా పిలుస్తారు. సీతాఫలంతో పోలిస్తే రామాఫలంలో గింజలు తక్కువగాను,గుజ్జు ఎక్కువగాను ఉంటుంది. ఒక పండు తింటే అలసిన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అందువల్ల పశ్చిమదేశాల్లో క్రీడాకారులు జ్యూస్‌గా చేసి తాగుతుంటారట.

రామాఫలంలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ల శాతం ఎక్కువ. సి- విటమిన్‌తో పాటు బి-కాంప్లెక్స్‌లోని పైరిడాక్సిన్‌ ఇందులో సమృద్ధిగా ఉంటుంది. ఈ పైరిడాక్సిన్‌ మెదడు కణాలకు అవసరమైన రసాయనాల్ని స్థిరంగా ఉంచేందుకు దోహదపడుతుంది. నరాల వ్యాధులు, తలనొప్పి వంటివి రాకుండా కాపాడేందుకు తోడ్పడుతుంది. రామాఫలంలో విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఫ్రీ రాడికల్స్ బారి నుండి శరీరాన్ని కాపాడుతుంది.

గుండెకు సంబంధింత సమస్యలను తగ్గిస్తుంది. రామాఫలంలో విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన అధిక కొలెస్ట్రాల్ మరియు అధిక రక్తపోటును తగ్గించటంలో సహాయాపడుతుంది. ఈ పండులో విటమిన్ B6 సమృద్ధిగా ఉండుట వలన రక్తనాళాల్లో కొవ్వు చేరకుండా చేస్తుంది. దాంతో గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. అలాగే విటమిన్ B6 కిడ్నీలో రాళ్లను నిరోధిస్తుంది.

రామాఫలంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండుట వలన హిమోగ్లోబిన్ ఉత్పత్తికి దోహదపడుతుంది. అలాగే శరీరంలో వివిధ కణాలకు ఆక్సిజన్ రవాణాకు సహాయపడుతుంది. రక్తహీనతతో బాధపడేవారికి రామాఫలం దివ్య ఔషధం అని చెప్పవచ్చు. రక్తహీనతతో బాధపడేవారు రామాఫలం తింటే చాలా మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."