Healthhealth tips in telugu

Almond and Honey:తేనెలో నానబెట్టిన బాదం తింటే ఎన్నో ప్రయోజనాలు..

Honey And Almond health Benefits : ఈ సీజన్ లో ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు రాకుండా ఉండాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. బాదం పప్పు,తేనె రెండింటిలోను ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి తింటే కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

ఒక జార్ లో శుభ్రంగా కడిగి ఆరబెట్టిన బాదం పప్పులను వేయాలి. దానిలో బాదం పప్పులు మునిగే వరకు తేనె వేసి మూత పెట్టాలి . వీటిని దాదాపుగా వారం రోజుల పాటు తినవచ్చు. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. బాదంపప్పుతో తేనె కలిపి తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయి అదుపులో ఉండటమే కాకుండా శారీరక శక్తి పెరుగుతుంది.

బాదంపప్పు జింక్, బి విటమిన్లు మరియు ఐరన్ వంటి పోషకాలు సమృద్దిగా ఉన్నాయి. తేనెలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఉన్నాయి. ఈ మిశ్రమం ఫ్లూ సీజన్‌లో శరీరాన్ని బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది.బాదంలో ప్రోటీన్, ఫైబర్ సమృద్దిగా ఉంటాయి. తేనెలో ఆకలిని నియంత్రించే ఎంజైమ్స్ ఉంటాయి.

కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. అందువల్ల బరువు తగ్గాలనే ప్రణాళికలో ఉన్నవారికి మంచి ఆహార ఎంపిక అని చెప్పవచ్చు. ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. జీర్ణ సంబంద సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. అయితే రోజుకి ఎంత మోతాదులో తీసుకోవాలో అనే సందేహం చాలా మందికి ఉంటుంది.

ప్రతి రోజు పరగడుపున తేనెలో నానబెట్టిన రెండు బాదం పప్పులను తీసుకుంటే సరిపోతుంది. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి కాస్త శ్రద్ద పెట్టి ఇటువంటి ఆహారాలను తీసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఆర్గానిక్ తేనె వాడితే మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.