Masala Jonna Rotte:మసాలా జొన్న రొట్టె ఇలా ఈజీగా చేసి చూడండి.. చాల టేస్టీగా ఉంటుంది
Masala Jonna Rotte: ఆరోగ్యకరమైనా జొన్నరొట్టెను పిల్లలు కూడ ఇష్టంగా తినాలంటే కాసింత మసాలా,వెజిటెబుల్స్ యాడ్ చేసి చేయండి.
కావాల్సిన పదార్ధాలు
జొన్న పిండి – 2 కప్పులు
గోధుమ పిండి – ½ కప్పు
ఉల్లిపాయలు – 1
క్యారట్ తురుము – 1
పచ్చిమిర్చి – 2-3
కొత్తిమీర – ½ కప్పు
నువ్వలు – 2 టేబుల్ స్పూన్స్
జీలకర్ర- 1 టీ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
తయారీ విధానం
1.ఒక మిక్సింగ్ బౌల్ లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు,క్యారట్ తురుము,కొత్తిమీర,కరివేపాకు తరుగు,పచ్చిమిర్చి తరుగు,నవ్వులు,జీలకర్ర,ఉప్పు వేసి కలుపుకోవాలి.
2.అందులోకి రెండు కప్పులు జొన్నపిండి,గోధుమ పిండి వేసుకోని గోరువెచ్చని నీళ్లతో కలుపుకోవాలి.
3.పిండిని గట్టిగా కాకుండా ,మెత్తాగా కలుపుకోవాలి.
4.రొట్టె కు సరిపడా పిండి ముద్దను తీసుకోని నెమ్మదినెమ్మది గా పీట పై వత్తుకోవాలి.
5.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నూనె రాసుకోని రొట్టేను పెనం పై వేసుకోవాలి.
6.చేతులతో రొట్టెను పెనం పై నొక్కండి.
7.ప్యాన్ అంతటా వత్తుకున్నాక మద్యలో రంధ్రాలు చేసుకోవాలి.
8.స్టవ్ నీ మీడియం ఫ్లేమ్ లోకి పెట్టుకోని మూత వేసి రెండు నుండి మూడు నిమిషాలు ఉడికించాలి.
9.అంచులు వదులుగా ఉన్నాయంటే ఉడకిందని అర్దం.అప్పుడు రొట్టెను రెండో వైపు కి తిప్పుకోవాలి.
10.కావాలి అనుకుంటే కాస్త నూనె వేసుకోవచ్చు.
11.రొట్టెను తిప్పుతూ కరకరమనేలా కాల్చుకోవాలి.
12.అంతే మసాలా జొన్నరొట్టె రెడీ.