Kitchenvantalu

Rice Flour Puri:బియ్యంపిండితో ఇలా పూరీ చేసి ఓసారి రుచి చూడండి ఎంత బాగుంటాయో..

Rice Flour Puri: ఈవినింగ్ స్నాక్స్ కి పిల్లలైనా ,పెద్దవారైనా ఎంతో ఇష్టంగాతినే బియ్యం పిండి స్పెషల్ పూరీలు. కారం కారంగా కరకరలాడే పూరీలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
బియ్యం పిండి – 2 కప్పులు
అల్లం ముక్కలు – 2-3 ఇంచ్ లు
వెల్లుల్లి రెబ్బలు – 7-8
ఉల్లిపాయ -1
పచ్చమిర్చి – 5-6
నెయ్యి – కొద్దిగా
కరివేపాకు – 5-6 రెమ్మలు
జీలకర్ర – 1 టీ స్పూన్
అజోవాన్ – ½ టీ స్పూన్
నువ్వులు – 2 టేబుల్ స్పూన్
ఉప్పు – తగినంత

తయారీ విధానం
1.ముందుగా మిక్సి జార్ లోకి అల్లం,వెల్లుల్లి ,ఉల్లిపాయలు,పచ్చిమిర్చి వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
2.ప్యాన్ వేడి చేసి అందులోకి నెయ్యి ,లేదా నూనే వేడి చేసి అందులోకి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని వేసి నిమిషం పాటు వేపుకోవాలి.
3.అందులోకి తరగిన కరివేపాకు,రెండు కప్పుల నీళ్లు ,జీలకర్ర,అజోవాన్,నువ్వులు,టీ స్పూన్ ఉప్పు వేసి నీళ్లను మరిగించాలి.
4.నీళ్లు మరిగాక స్టవ్ లోఫ్లేమ్ లోకి మార్చుకోని అందులోకి బియ్యం పిండిని వేసి కలుపుకోవాలి.
5.స్టవ్ ఆఫ్ చేసి పదినిమిషాలు పక్కన పెట్టుకోవాలి.

6.ఉడికిన బియ్యం పిండి మిశ్రమాన్ని వేరొక గిన్నెలోకి మార్చుకోవాలి.
7.చల్లారిన పిండిని బాగా కలుపుకోని ప్లాస్టిక్ కవర్ పై పూరీలను వత్తుకోవాలి.
8.డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసి వత్తుకున్న పూరీలను ఫ్రై చేయండి.
9.రెండు వైపుల ఎర్రగా కాల్చుకుంటే బియ్యం పిండి పూరీలు రెడీ.