Godhuma Rava Upma:ఉప్మా ఇలా చేస్తే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం..
Godhuma Rava Upma:గోధుమ రవ్వ ఉప్మా.. ఈజీ అండ్ హెల్తీ టిఫిన్స్ లో గోధుమ రవ్వను కూడ చేర్చుకోవాలి. మార్నింగ్ టిఫిన్స్ లోకి పిల్లల లంచ్ బాక్స్ లోకి గోధుమ రవ్వ ఉప్మా పర్ ఫెక్ట్ గా సూట్ అవుతుంది.వేయించుకున్న గోధుమ రవ్వను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే మూడు నుండి నాలుగు నెలల వరకు నిలువ ఉంటుంది.
కావాల్సిన పదార్ధాలు
గోధుమ రవ్వ – 1 kg
కొత్తిమీర – ½ కప్పు
శనగ పప్పు – 2 టీ స్పూన్స్
మినపప్పు – 2 టీ స్పూన్స్
ఆవాలు – 1 టీ స్పూన్
జీలకర్ర – 1 స్పూన్
అల్లం – 2 స్పూన్
పచ్చిమిర్చి – 5-6
కరివేపాకు – ½ కప్పు
ఉప్పు – తగినంత
తయారీ విధానం
1.ప్యాన్ లో నూనే వేసి చేసి వేడెక్కాక కేజీ గోధుమ రవ్వ వేసి వేపుకోవాలి.
2.అందులోకి కప్పు కొత్తిమీర వేసి తడి పోయే వరకు వేపుకోవాలి.
3.వేపుకున్న రవ్వను వేరోక ప్లేట్ లోకి తీసుకోవాలి.
4.అదే ప్యాన్ లోకి రెండు టేబుల్ స్పూన్స్ బటర్,లేదా నూనే వేసి వేడి చేసుకోవాలి.
5.అందులోకి మినపప్పు,శనగపప్పు,ఆవాలు,జీలకర్ర,పల్లీలు ,అల్లం తరుగు,పచ్చిమర్చి వేసుకోని ఫ్రై చేసుకోవాలి.
6.తాలింపు వేగాక కప్పు కరివేపాకు ,పసుపు వేసి పచ్చిమిర్చి ,కరివేపాకు పూర్తిగా ఫ్రై అయ్యే వరకు లోఫ్లేమ్ పై వేపుకోవాలి.
7.ఇప్పుడు ముందుగా వేపి పక్కన పెట్టుకున్న గోధుమ రవ్వ,తగినంత ఉప్పు వేసి బాగా వేపుకోవాలి.
8.స్టవ్ ఆఫ్ చేసుకోని చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటేనర్ లో స్టోర్ చేసి పెట్టుకుంటే నెల ,రెండు నెలల వరకు వాడుకోవచ్చు.
9.రెడీ చేసుకున్న ఇనిస్టంట్ రవ్వ మిక్స్ ని ఉప్మా చేసుకోవడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని కప్పు రవ్వకి మూడు కప్పుల నీళ్లను వేసి మరిగించాలి.
10.అవసరం అనుకుంటే నచ్చిన వెజిటెబుల్స్ యాడ్ చేసుకోవచ్చు.
11.ఎసరు మరిగిన తర్వాత ఇని స్టంట్ మిక్స్ రవ్వను వేసి ఉడికించుకుంటే గోధుమ రవ్వ ఉప్మా చిటికెలో రెడీ అవుతుంది.
12.మార్నింగ్ టైమ్ సేవ్ అవ్వాలి అనుకునే వారు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు..