MoviesTollywood news in telugu

Allari priyudu:అల్లరి ప్రియుడు సినిమాని మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

Allari priyudu Hero :సినీ ప్రపంచంలో ఎన్నో మాయలు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఒక సినిమా ఒక హీరో చేస్తున్నాడు అని తెలిసే లోపే ఒక్కోసారి హీరో మారిపోతూ ఉంటాడు.

ఒక్కోసారి అదృష్టం వెతుక్కుంటూ వస్తే, ఇంకోసారి దురదృష్టం వెంటాడుతుంది. ఎప్పుడెలా జరుగుతుందో తెలీదు. ఇక సినిమా పరిశ్రమలో ఛాన్స్ లు కూడా అలాగే ఉంటాయి. లేకపోతె యాంగ్రీ యంగ్‌మెన్‌గా ఆడియన్స్ మనస్సులో దూసుకెళ్తున్న హీరో డాక్టర్ రాజశేఖర్ కి ఇద్దరి భామల పక్కన అల్లరి ప్రియుడిగా నటించే ఛాన్స్ ఎలా వస్తుంది.

అవును, అప్పటి దాకా అంకుశం లాంటి సినిమాలతో పోలీసు పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా రాజశేఖర్ నిలిచాడు. వరుస ఫ్లాపులతో దెబ్బతిన్న ప్రతిసారి బ్లాక్‌బస్టర్‌తో మళ్లీ పుంజుకోవడం అతడికే చెల్లింది. నిజానికి రాజశేఖర్‌ కేవలం పోలీసు వేషాలే కాకుండా విభిన్న పాత్రలు పోషిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

కెరీర్లో ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలు ఉన్నప్పటికీ ‘అల్లరి ప్రియుడు’ రూటే వేరు. రాజశేఖర్‌ను యువతకు, మహిళలకు బాగా దగ్గర చేసిన మూవీ ఇది. కె.రాఘవేంద్రరావు డైరెక్షన్లో తెరకెక్కిన ఈ అద్భుతమైన ప్రేమకథ అప్పట్లో సంచలన విజయం అందుకుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం సూపర్భ్.

అయితే ‘ఎప్పుడూ సీరియస్ పాత్రలు చేసే రాజశేఖర్ లవ్ స్టోరీలకు సూటవుతాడా? అనే కామెంట్స్ కూడా వినిపించాయట. అయితే రాజశేఖర్ ఆ పాత్రకు తాను మాత్రమే ఛాయిస్ అన్నట్లు నటించి చూపించాడు. ఇంతకీ ఈ సూపర్‌ హిట్ సినిమా రాజశేఖర్ ఫస్ట్ ఛాయిస్ కాదట.

అప్పట్లో యాక్షన్, ఫ్యామిలీ హీరోగా మంచి ఫామ్‌లో ఉన్న సుమన్‌ కోసం దర్శకుడు కె.రాఘవేంద్రరావు అనుకున్నారు. ఆ సమయంలో సుమన్ కొన్ని సమస్యల్లో చిక్కుకోవడంతో డాక్టర్ రాజశేఖర్‌ను ఈ అదృష్టం వరించింది. అందుకే దేనికైనా పెట్టిపుట్టాలి అంటారు.