MoviesTollywood news in telugu

Tollywood:సూర్య IPS సినిమాని మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా ?

Surya IPS Movie :టి.సుబ్బ‌రామిరెడ్డి అనగానే అప్పట్లో బడా ప్రొడ్యూసర్. తెలుగు, హిందీ భాషల్లోనే కాదు ఇతర భాషల్లో కూడా ఆయన మూవీస్ చేసాడు. మెగాస్టార్ చిరంజీవితో క్లోజ్‌గా ఉండే అయన మ‌రో స్టార్ హీరోతో సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాడు. హీరోయిన్ విష‌యంలో మార్పు అనివార్య‌మైంది.

దాంతో మార్చేశారు. వివరాల్లోకి వెళ్తే, సుబ్బ‌రామిరెడ్డి నిర్మాణంలో వెంక‌టేశ్ హీరోగా సూర్య ఐపీయ‌స్ సినిమా స్టార్ట్ చేసారు. ఈ సినిమాలో ముందు హీరోయిన్‌గా మీనాక్షి శేషాద్రి అనుకున్నారు. తొలి స‌న్నివేశాన్ని కూడా మ‌ద్రాసులోని ఏవీఎం స్టూడియోలో చిత్రీక‌రించారు. ఆ సినిమాకు చిరంజీవి అతిథిగా వ‌చ్చేసి క్లాప్ కూడా కొట్టారు.

కొన్ని కార‌ణాల‌తో షూటింగ్ ప్రారంభం కావ‌డానికి స‌మ‌యం ప‌ట్టింది. ఈ గ్యాప్‌లో హీరోయిన్ మారిపోయింది. మీనాక్షి స్థానంలో విజ‌య‌శాంతి చేరింది. అప్ప‌ట్లో మీనాక్షి శేషాద్రి అంటే ఓ క్రేజ్. స్టార్ హీరోయిన్ ఇమేజ్ఉన్న ఆమెను ప‌క్క‌న పెట్టి విజ‌య‌శాంతిని ఎలా తీసుకున్నారు? మీనాక్షి ఏమీ అన‌లేదా?

అస‌లు మీనాక్షి శేషాద్రికి సుబ్బ‌రామిరెడ్డి ఏం చెప్పారు ఇలా ఎన్నో ప్రశ్నలు. అయితే ఓ సంద‌ర్భంలో సుబ్బ‌రామిరెడ్డి దీనిపై వివరణ ఇస్తూ, చిరంజీవితో సినిమా చేయాల్సి వ‌చ్చింది. అందులో నువ్వే హీరోయిన్‌. వెంక‌టేశ్ కంటే చిరంజీవి ప‌క్క‌న అయితే బావుంటుంది క‌దా! అని అబ్బ‌ద్ధం చెప్పాడ‌ట‌.

దీంతో సుబ్బారామిరెడ్డి మాట‌ల‌ను న‌మ్మిన మీనాక్షి శేషాద్రి కూడా ఒకే చెప్పేసిందట. నిజానికి అప్ప‌టికీ చిరంజీవితో సుబ్బ‌రామిరెడ్డి మూవీ ఏదీ క‌న్‌ఫ‌ర్మ్ కాలేదు.కానీ మీనాక్షి శేషాద్రితో చెప్పిన అబ‌ద్ధం కొన్నాళ్లు నిజ‌మైంది. చిరంజీవి ప్ర‌తిబంద్ త‌ర్వాత హిందీలో న‌టించిన చిత్రం అజ్‌కా గూండారాజ్‌లో మీనాక్షిశేషాద్రి హీరోయిన్‌గా చేసింది.

ఆతర్వాత తెలుగులో చిరంజీవి హీరోగా కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆపద్బాంవుడులోనూ హీరోయిన్‌గా చేసింది. ఆ చిత్రానికి సుబ్బారామిరెడ్డి నిర్మాత కాక‌పోయిన‌ప్ప‌టికీ ఆయ‌న చెప్పిన అబ‌ద్ధం మాత్రం నిజ‌మైంది. అయితే విజయశాంతిని హీరోయిన్‌గా తీసుకుని చేసిన సినిమా సూర్య ఐపీయస్ బాక్సాఫీస్ వద్ద అనుకున్న విజయాన్ని నమోదు చేయలేదు.