Kitchenvantalu

Biyyam Ravva Upma:బియ్యం రవ్వ ఉప్మా.. ఇలా చేసి చూడండి.. పొడి పొడిగా రుచిగా ఉంటుంది …

Biyyam Ravva Upma Recipe:బియ్యం రవ్వ ఉప్మా.. ఇలా చేసి చూడండి.. పొడి పొడిగా రుచిగా ఉంటుంది … బియ్యం రవ్వ ఉప్మా..బ్రేక్ ఫాస్ట్ లోకి చిటికెలో చేసుకునే హెల్తీ బియ్యం రవ్వ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
బరకగా చేసుకున్న బియ్యం రవ్వ – 2 కప్పులు
పచ్చిమిర్చి – ¼ కప్పు
ఉల్లిపాయలు – ¼ కప్పు
టొమాటో – ¼ కప్పు
క్యారేట్ – ¼ కప్పు
బంగాళదుంపలు – ¼ కప్పు
జీలకర్ర – 1 టీ స్పూన్
ఆవాలు – 1 టీ స్పూన్
అల్లం – 1 టీ స్పూన్
ఉప్పు – 1 ½ టీ స్పూన్
కరివేపాకు – ¼ కప్పు
కొత్తిమీర – ¼ కప్పు

తయారీ విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని ఆయిల్ వేడి చేసి బియ్యం రవ్వను వేపుకోవాలి.
2.వేపుకున్న రవ్వను పక్కన పెట్టుకోని అదే ప్యాన్ మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి.
3.అందులోకి జీలకర్ర,ఆవాలు,అల్లం ,ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి.
4.ఉల్లిపాయలు వేగాక పచ్చిమిర్చి ,కరివేపాకు ,క్యారేట్ ,బంగాళదుంప,టమాటో ముక్కులు వేసి మెత్తపడే వరకు ఉడికించుకోవాలి.
5.రుచికి సరిపడా ఉప్పు వేసి రెండు కప్పుల రవ్వకు మూడు కప్పుల నీళ్లను వేసి పచ్చి శనగపప్పును వేసి మరగనివ్వాలి.
6.ఎసరు మరిగిన తర్వాత వేయించి పెట్టుకున్న రవ్వను వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.
7.రవ్వ ఉడికే వరకు లో ఫ్లేమ్ లో ఉడికించాలి.
8.చివరిగా కొత్తి మీర చల్లుకోని స్టవ్ ఆఫ్ చేసుకుంటే బియ్యం రవ్వ ఉప్మా రెడీ.