Kitchenvantalu

Boda Kakarakaya Fry:బోడ కాకరకాయ వేపుడు ఎప్పటిలా కాకుండా ఇలా చేసి చూడండి.. రుచి సూపర్..

Boda Kakarakaya Fry Recipe: బోడ కాకరకాయ వేపుడు ఎప్పటిలా కాకుండా ఇలా చేసి చూడండి.. రుచి సూపర్..బోడ కాకరకాయ వేపుడు.. సీజన్ దొరికే బోడకాకరకాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. బోడ కాకరకాయలతోట పులుసు ,ఇగురు ఫ్రై కూడ చేసుకోవచ్చు. ఇప్పుడు వేపుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
బోడ కాకరకాయలు – ½ kg
జీలకర్ర – 1 స్పూన్
ఉల్లిపాయలు – 1
కరివేపాకు – ½ టీ స్పూన్
పసుపు – ½ టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
కారం – 2 టీ స్పూన్స్
ఉప్పు – 1 ½ టీ స్పూన్
నువ్వుల పొడి – 1 టీ స్పూన్
ధనియాల పొడి – 1 ½ టీ స్పూన్
కొబ్బరి పొడి – 1 ½ టీ స్పూన్
కొత్తిమీర – కొద్దిగా

తయారీ విధానం
1.ముందుగా బోడకాకరకాయలను తగినన్ని నీళ్లుపోసి పదినిమిషాలు ఉడకించుకోవాలి.
2.కాకరకాయలను గింజలతో పాటుగా వేపుకోవచ్చు.
3.స్టవ్ పై బాండీ పెట్టుకోని అందులోకి ఆయిల్ వేసి జీలకర్ర,ఉల్లిపాయలు,పచ్చిమిర్చి ,కరివేపాకు,పసుపు,అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి.
4.తాలింపు వేగాక అందులోకి బోడకాకరకాయ ముక్కలను వేసి మిక్స్ చేసుకోవాలి.
5.కాకారకాయలు వేగాక అందులోకి కారం,ఉప్పు,ధనియాలపొడి,నువ్వుల పొడి,కొబ్బరి పొడి వేసి కలుపుకోవాలి.
6.రుచి కోసం కొద్దిగా బెల్లం ,లేదా చక్కెరను కూడ యాడ్ చేయవచ్చు.
7.లో ఫ్లేమ్ పై ఆరేడు నిమిషాలు ఉడకించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
8.చివరగా కొత్తిమీర చల్లుకుంటే బోడకాకరకాయ వేపుడు రెడీ.