Kitchenvantalu

Leftover Idli Pakora:మిగిలిన ఇడ్లీతో ఇలా చేస్తే రుచి చాలా బాగుంటుంది..

Left Over Idli pakora Recipe:మిగిలిన ఇడ్లీతో ఇలా చేస్తే రుచి చాలా బాగుంటుంది.. ఇడ్లీ పకోడ.. ఇడ్లీలు కాస్త చల్లారక అస్సలు తినాలి అనిపించదు. ఒక్కొసారి ఇడ్లీలు ఎక్కువగా మిగిలిపోతుంటాయి. మిగిలిపోయిన ఇడ్లీతో పకోడ చేసి చూడండి ఖచ్చింతంగా నచ్చుతుంది.

కావాల్సిన పదార్ధాలు
ఇడ్లీలు – 4
శనగపిండి – ½ కప్పు
ఉల్లిపాయలు -1
పచ్చిమిర్చి – 2-3
ఉప్పు – 1 టీ స్పూన్
కారం – ½ టీ స్పూన్
పసుపు – చిటికెడు
జీలకర్ర – ½ టీ స్పూన్
అల్లంవెల్లుల్లి పేస్ట్ – ½ టీ స్పూన్
కరివేపాకు – ½ కప్పు
కొత్తిమీర – చిన్న కట్ట
నూనె – తగినంత

తయారీ విధానం
1.ఒక మిక్సింగ్ బౌల్ లోకి మిగిలిపోయిన ఇడ్లీలను మాష్ చేసుకోని తీసుకోవాలి.
2.అందులోకి శనగ పిండి,తరిగిన ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,కారం,ఉప్పు,కరివేపాకు,కొత్తిమీర,అల్లవెల్లుల్లి పేస్ట్,పసుపు,జీలకర్ర వేసి కొద్ది కొద్దిగా నీళ్లను కలుపుతు పిండిని పొడి పొడిగా కాని,జారుగా కాని మిక్స్ చెయ్యొద్దు.
3.ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ పై ఆయిల్ వేడి చేసుకోవాలి.
4.ఇడ్లీ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేడి నూనెలో పకోడాలు వేసుకోవాలి.
5. స్టవ్ మీడియం ఫ్లేమ్ పై పెట్టుకోని పకోడిలు కలర్ మారే వరకు వేపుకోవాలి.
6.చల్లని ఇడ్లీలను వేడి వేడి పకోడిలా సర్వ్ చేసారంటే నో చెప్పకుండా లాగించేస్తారు.