Kitchenvantalu

Rice Cheese Balls:మిగిలిన అన్నంతో బోండాలు.. ఇలా తయారు చేయండి.. చాలా రుచిగా ఉంటాయి

Rice Cheese Balls ecipe:మిగిలిన అన్నంతో బోండాలు.. ఇలా తయారు చేయండి.. చాలా రుచిగా ఉంటాయి. రైస్ చీజ్ బాల్స్.. వండిన అన్నంతో ఇన్ స్టంట్ గా తయారు చేసుకునే స్నాక్స్ రైస్ బాల్స్ . పిల్లల కోసం వేడి వేడిగా రెడీ చేసి పెట్టండి ఇష్టగా తినేస్తారు.

కావాల్సిన పదార్ధాలు
వండిన అన్నం – 1 కప్పు
చీజ్ – 2-3 టేబుల్ స్పూన్స్
ఉల్లిపాయలు – 1
తురిమిన క్యారెట్లు – 3 టేబుల్ స్పూన్స్
పచ్చిమిర్చి – 2
కారం – 1 టీ స్పూన్
ఉప్పు – 1 టీ స్పూన్

తయారీ విధానం
1.వండిన అన్నం ఒక కప్పు తీసుకోని అందులోకి చీజ్ కలుపుకోవాలి.
2.తర్వాత అందులోకి ఉల్లిపాయ తరుగు,క్యారెట్ తరుగు,వెజిటెబుల్ తరుగు,పచ్చిమిర్చి,కొత్తిమీర,రెండు టేబుల్ స్పూన్స్ మైదా, కారం,ఉప్పు వేసి కలుపుకోవాలి.
3.కలుపుకున్న రైస్ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ తయారు చేసుకోవాలి.
4.ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసి తయారు చేసుకున్న బాల్స్ ని ఫ్రై చేసుకోవాలి.
5.రెండు వైపులా దోరగా వేపుకుంటే చీజ్ రైస్ బాల్స్ రెడీ.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."