Beauty Tips

Dark spots: నల్లమచ్చలు చర్మంపై ఎక్కువగా వస్తున్నాయా? అయితే ఈ టిప్స్​ పాటించి సమస్య దూరం చేసుకోండి

sun Flower seeds Beauty Tips : సన్ ఫ్లవర్ సీడ్స్ ఈ మధ్యకాలంలో చాలా బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ మధ్య మారిన పరిస్థితుల కారణంగా మనలో చాలా మంది ప్రతి రోజూ సన్ ఫ్లవర్ సీడ్స్ వాడుతున్నారు. ఈ గింజలలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే సన్ ఫ్లవర్ సీడ్స్ లో చర్మ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

అయితే మనలో చాలామందికి ఈ విషయం తెలీదు. సన్ ఫ్లవర్ గింజలు చర్మం మీద మృత చర్మ కణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మెరవడానికి అలాగే ముడతలు తగ్గటానికి, మొటిమలు, నల్లని మచ్చలను తొలగించటానికి చాలా బాగా సహాయపడతాయి. దీని కోసం ఒక ప్యాక్ తయారుచేసుకోవాలి.

పొయ్యి మీద పాన్ పెట్టి సన్ ఫ్లవర్ సీడ్స్ వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి కాస్త చల్లారాక మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా తయారు చేసుకుని సీసాలో నిల్వ చేసుకోవచ్చు. ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక స్పూన్ సన్ ఫ్లవర్ సీడ్స్ పొడి, అర స్పూన్ కొబ్బరి పొడి, పావు స్పూన్ జాజికాయ పొడి వేసి అన్ని బాగా కలిసేలా కలపాలి. .

ఆ తర్వాత సరిపడా కొబ్బరి పాలను వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక అరగంట అలా వదిలేయాలి. ఆ తర్వాత ఈ పేస్ట్ ముఖానికి రాసి ఒక నిమిషం సున్నితంగా మసాజ్ చేసి పది నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే నల్లని మచ్చలు, మొటిమలు వంటివి అన్నీ తొలగిపోతాయి.

ముఖం తెల్లగా అందంగా మెరవాలంటే బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. అలాగే వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చుతో చాలా సులభంగా ఇంటి చిట్కాలతో ముఖం మీద మొటిమలు,నల్లని అంచ్చలు, ముడతలు వంటి అన్నీ రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.