Beauty Tips

White Hair:తెల్ల వెంట్రుకలను పీకేస్తే మళ్ళీ వస్తాయా? నిజామా?

White Hair to Black :తలలో ఒక తెల్ల వెంట్రుక కనపడగానే అమ్మో అంటారు అందరూ. వెంటనే అద్దం ముందు కూర్చుని ఆ తెల్ల వెంట్రుకను తీసే వరకు నిద్రపోరు. కానీ కొంత మంది పెద్దగా పట్టించుకోరు.

వయసు పెరిగే గొద్దీ తెల్ల వెంట్రుకలు రావటం సహజమే. కానీ అసలు వయసు పెరగకుండానే తెల్ల వెంట్రుకలు వస్తే అది వేరే సంగతి. ఇంతకు అసలు విషయం ఏంటంటే.. తెల్ల వెంట్రుకలను తొలగిస్తే మళ్లీ వస్తాయా అనేదే ప్రశ్న. తెల్ల వెంట్రుకలకు, నల్ల వెంట్రుకలకు ఉన్న తేడా ఒక్కటే. మెలనిన్‌ అనే పదార్థం ఉంటే వెంట్రుకలు నల్లగా ఉంటాయి. మెలనిన్ శాతం తగ్గితే తెల్లగా కనపడతాయి. కొన్నిసార్లు నలుపు, తెలుపు కాకుండా గోధుమ రంగులో కూడా వెంట్రుకలు ఉంటాయి.

వెంట్రుకలు మన చర్మం కింద ఉండే రోమ కుదుళ్ల నుంచి మొలుస్తాయి. ఈ కుదుళ్లు ఉపరితల చర్మం కింద ఉన్న అంతశ్చర్మంలో ఉంటాయి. అక్కడే మెలనిన్‌ రేణువులు ఉత్పత్తి అవుతుంది. అక్కడి వెంట్రుక ప్రొటీన్‌ గొట్టంలో దట్టంగా పేరుకుంటూ పెరుగుతుంది. తెల్లని వెంట్రుకలు వచ్చే కుదుళ్ల దగ్గర మెలనిన్‌ రేణువుల ఉత్పత్తి తగ్గడం గానీ లేదా వృద్ధాప్యం వల్ల మందగించడం కానీ జరుగుతుంది.

ఆ తెల్ల వెంట్రుకల్ని పదే పదే తీసేసినప్పుడు అవి మాత్రమే పెరిగేలా ఆ కుదుళ్లు ఉత్తేజం చెందుతాయి. అప్పుడు తెల్ల వెంట్రుకల ఉత్పత్తి ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కొన్ని సార్లు తెల్ల వెంట్రుకలు తీసేసిన తర్వాత తిరిగి రాకపోవచ్చు. అది వ్యక్తుల శరీరం, వయసు, శరీర తత్వాన్ని బట్టి తెల్ల వెంట్రుకలు తిరిగి వస్తాయా రావా అనేది ఆధారపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.