Kitchenvantalu

Carrot Bobbattu:ఇలా నోట్లో వేసుకుంటే కరిగిపొయే Carrot Bobbatlu తప్పకుండా ట్రై చెయ్యల్సిందే..

Carrot Bobbattu Recipe: ఇలా నోట్లో వేసుకుంటే కరిగిపొయే Carrot Bobbatlu తప్పకుండా ట్రై చెయ్యల్సిందే.. క్యారేట్ బొబ్బట్లు.. స్వీట్స్ లో స్పెషల్ అంటే బొబ్బట్లు. క్యారెట్ తురుముతో బొబ్బట్లు చేసి చూడండి.

కావాల్సిన పదార్ధాలు
క్యారెట్ తురుము – 1 కప్పు
తురుమిన బెల్లం – ½ కప్పు
కొబ్బరి పొడి – 3 టేబుల్ స్పూన్
యాలకుల పొడి – ½ టీ స్పూన్
ఉప్పు – చిటికెడు
నెయ్యి – తగినంత

తయారీ విధానం
1.ఒక గిన్నెలోకి గోధుమ పిండిలో చిటికెడు ఉప్పు వేసి కలుపుకోవాలి.
2.కొద్ది కొద్దిగా నీళ్లను వేసి మెత్తని ముద్దలా కలుపుకోవాలి.
3.రెండు మూడు టీ స్పూన్స్ ఆయిల్ వేసి అరగంట పాటు పిండిని నానబెట్టుకోవాలి.
4.ఇప్పుడు స్టఫ్ కోసం ప్యాన్ నెయ్యిని వేడి చేసి అందులోకి తురిమిన బెల్లం వేసి తక్కువ మంట మీద వేపుకోవాలి.
5.మిశ్రమం గట్టి పడ్డాక అందులోకి కొబ్బరి పొడి వేసి కలుపుకోవాలి.

6.అందులోకి యాలకుల పొడి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
7.కలుపుకున్న పిండిని ముద్దలుగా చేసుకోని పూరిలుగా వత్తుకోవాలి.
8.అందులోకి స్టఫింగ్ ని పెట్టి పిండితో క్లోజ్ చేసి ఎక్స్ట్రా పిండిని తీసేసి ప్లాస్టిక్ కవర్ పై నూనే వేసి బొబ్బట్లను స్టఫ్ బయటికి రాకుండా వత్తుకోవాలి.
9.ప్యాన్ మీద వేసుకోని కరిగించిన నెయ్యిని వేసి మీడియం ఫ్లేమ్ పై కాల్చుకోవాలి.
10.అంతే వేడి వేడి క్యారేట్ బొబ్బట్లు రెడీ.