Kitchenvantalu

Biyyam pindi Dosa Recipe:బియ్యంపిండి దోశ క్రిస్పీ గా బాగా రావాలంటే ఈ టిప్స్ తో చేయండి..

Biyyam pindi Dosa Recipe:రైస్ ఫ్లోర్ దోస..ఇంట్లో ఉంటే బియ్యం పిండితో ఇన్ స్టంట్ గా దోశలు వేసుకోవచ్చు. ఈజీ అండ్ టేస్టీ బ్రేక్ ఫాస్ట్ రైస్ ఫ్లోర్ దోశ ఎలా వేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పదార్ధాలు
బియ్యం పిండి – 1 కప్పు
ఉల్లిపాయలు- 1
పచ్చిమర్చి – 4-5
కొత్తిమీర – ½ కప్పు
జీలకర్ర – 1 టీ స్పూన్
నువ్వులు – 2 టీ స్పూన్స్
ధనియాలు – ½ టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ½ టీ స్పూన్

తయారీ విధానం
1.మిక్సి జార్ లోకి పచ్చిమిర్చి ,ఉప్పు,కొత్తిమీర వేసి నీళ్లు యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి.
2.ఇప్పుడు మిక్సింగ్ బౌల్ లోకి బియ్యం పిండి ,జీలకర్ర,నువ్వులు,ధనియాలు,అల్లంవెల్లుల్లి పేస్ట్,గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలుపుకోవాలి.
3.నీళ్లను పోసి బ్యాటర్రెడీ చేసుకోవాలి.
4.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నూనె లో ముంచిన ఉల్లిపాయతో ప్యాన్ ని రుద్దుకోవాలి.

5.ఇప్పుడు కాస్తా పల్చాగా కలుపుకున్న దోశ బ్యాటర్ ని పెనం పై అట్టులా వేసుకోవాలి.
6.అంచులకు నూనె వేసి మూత వేసుకోవాలి.
7.బ్రౌన్ కలర్ వచ్చే వరకు లోఫ్లేమ్ లో కాల్చుకోని హై ఫ్లేమ్ లో ఒక నిమిషం పాటు వేపుకుంటే దోశ క్రిస్పిగా ఉంటుంది.
8.తయారు చేసుకున్న దోశను వేడి వేడి గా సర్వ్ చేసుకోవడమే.