Kitchenvantalu

Karivepaku Podi Recipe:కరివేపాకు కారం పొడి ఇలా చేస్తే ఇడ్లీ, దోశ, అన్నంల్లోకి రుచి అదిరిపొయేలా వుంటుంది

Karivepaku Podi Recipe:కరివేపాకు కారం పొడి.. ఎన్ని వెరైటీ డిషెస్ చేసుకున్న మొదటి ముద్ద కారం పొడితో తింటే ఆ మజానే వేరు.కండ్లకు మేలు చేసే కరివేపాకు పొడి తయారు చేసి పెట్టుకోండి.రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.కరివేపాకు పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
కరివేపాకు – 1 కట్ట
శనగపప్పు – 2 టేబుల్ స్పూన్స్
ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్
జీలకర్ర – 1 టీ స్పూన్
మెంతులు – ¼ టీ స్పూన్
నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్
మిరియాలు – ¼ టీ స్పూన్
చింతపండు – 10-15 గ్రాములు
వెల్లుల్లి రెబ్బలు – 7-8
ఎండుమిర్చి – 10-12
ఉప్పు – 1 ½ టీ స్పూన్

తయారీ విధానం
1.ముందుగా కరివేపాకు ను తేమ లేకుండా ఆరబెట్టుకోవాలి.
2.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని బాండీలో నూనే వేడి చేసి అందులోకి శనగపప్పు,ఎండుమిర్చి,వేసి వేపుకోవాలి.
3.ధనియాలు ,జీలకర్ర,మెంతులు ,నువ్వులు,మిరియాలు,చింతపండు ,వెల్లుల్లి రెబ్బలు కూడ వేసి నిమిషం పాటు వేపుకోని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
4.పప్పు దినుసులను పూర్తిగా చల్లారనివ్వాలి.

5.వేరే బాండీలో నూనే వేసి ఆరిన కరివేపాకును కూడ వేపుకోవాలి.
6.ఇప్పుడు మిక్సి జార్ లోకి వేపుకున్న పదార్ధాలను వేసి ఉప్పు యాడ్చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
7.ఇప్పుడు అందులోకి కరివేపాకు వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
8.అంతే కరివేపాకు రెడీ ఎయిర్ టైట్ కంటేనర్ లో స్టోర్ చేసుకుంటే పదిహేను రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటుంది.