Kitchenvantalu

Dates Cake: కోడిగుడ్లు లేకుండా ఖర్జూరం కేక్‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..

Dates Cake:అకే షన్ ఏదైనా సెలబ్రేషన్ కంపల్సరీ..సెలబ్రేషన్ అంటే కేక్ లేకపోతే ఎలామరీ..అలా అని ప్రతీసారి బేకరీ కేక్స్ తినలేం..అవి ఆరోగ్యకరం కూడా కాదు.సో ఇంట్లోనే కేక్ తయారు చేసుకుంటే,బోల్డంత మనీ సేవ్ అవుతుంది. హెల్త్ గురించి టెన్షన్ తప్పుతుంది.కొత్తగా ట్రై చేసామనే ఫీలింగ్ కలుగుతుంది.ఇంకెందుకు ఆలస్యం ఇంట్లోనే సింపుల్,హెల్తీ, డేట్స్ కేక్ చేసేద్దామా మరి..

కావాల్సిన పదార్థాలు
ఖర్జూరాలు – ( బాగా పండినవి ) 10 నుంచి 12
నీరు – 3/4 కప్పు
మైదా – 3/4 కప్పు ( జల్లించి తీసుకోండి)
బేకింగ్ సోడా – 1 టేబుల్ స్పూన్ ( జల్లించి తీసుకోండి)
బటర్ – 1/3 కప్పు
చక్కెర – 75 గ్రాములు
గుడ్డు – 1
వెనీలా ఎసెన్స్ – 1 టేబుల్ స్పూన్
ఖర్జూరం ఉడికించిన నీరు – 90 ml

తయారి విధానం
1.ఒక గిన్నెలో ఖర్జూరాలు వేసి నీరు పోసి ఉడికించాలి. ఉడికించిన ఖర్జూరాలను వడకట్టి, నీరు పక్కన పెట్టుకోవాలి. ఉడికిన ఖర్జూరాలను మిక్సీలో పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

2.వేరొక గిన్నెలో చక్కెర, గుడ్డు, తీసుకుని, వాసన రాకుండా, వెనీలా ఎసెన్స్ ను యాడ్ చేసి, నురగ వచ్చేవరకు బీట్ చేయాలి.

3.ఇప్పుడు జెల్లించిపెట్టుకున్న మైదాపిండి, బేకింగ్ సోడాకు బటర్ యాడ్ చేసి, మూడింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి.

4.పై మిశ్రమంలో ఉడికించిన ఖర్జూరం పేస్ట్, అలాగే మిగిలిన వాటర్ కలపి, బాగా మిక్స్ చేయాలి.

5.బేకింగ్ బౌల్ కి లోపలి వైపు బటర్ పూసి , పల్చగా మైదా పిండి జల్లుకోవాలి.

6.ఇప్పుడు తయారు చేసుకున్న కేక్ మిశ్రమాన్ని బేకింగ్ గిన్నెలో పోసుకుని, ఈవెన్ గా  స్ప్రెడ్ చేయాలి.

బేకింగ్ ప్రాసెస్
180 డిగ్రీల వద్ద 25 నిముషాలు పాటు బేక్ చేసుకోవాలి ( చివరిగా బేక్ అయిందా లేదా అని తెల్సుకోవాడం కోసం ఒక టూట్ పిక్ ను కేక్ పై గుచ్చి తీయాలి. టూట్ పిక్ కు ఎలాంటి మిశ్రమం అంటుకోకుండా ఉంటే, కేక్ రెడీ అయినట్లే)

బేక్ అయిన కేక్ ను చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి.

చల్లారిన కేక్ ను డీమోల్ట్ విధానంలో వేరొక ప్లేట్ లోకి ట్రాన్స్ ఫర్ చేయాలి. అంతే నండీ , టేస్టీ టేస్టీ డేట్స్ కేక్ రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News