Healthhealth tips in telugu

Neem Fruit:ప‌ర‌గ‌డుపున‌ రెండు పండ్లను తింటే ఎన్నో ఊహించని ప్రయోజనాలు…

Neem Fruit Health Benefits In telugu : వేప చెట్టులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ప్రాచీన కాలం నుండి వేపను ఒక ఔషధంగా ఉపయోగిస్తున్నారు. వేప ఆకుల నుండి కొమ్మల వరకు ప్రతి భాగం మనకు ఎన్నో రకాలుగా సహాయపడుతుంది. అయితే వేప పండు లేదా గింజ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

అయితే ఈ విషయం మనలో చాలామందికి తెలియదు. వేప పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం. పరగడుపున రెండు వేప పండ్లను తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి వేప పండ్లు ఒక వరం వంటివి అని చెప్పవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.

శరీరంలోని వ్యర్ధాలు అన్నీ తొలగిపోతాయి. వేప పండ్లు మరియు ఆకులతో చేసిన టీ తాగడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు నయం అవుతాయి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి రెండు వేప పండ్లు మరియు మూడు వేప ఆకులు వేసి 5 నిమిషాలు మరిగించి… ఆ నీటిని వడకట్టి తాగాలి.

కాస్త చేదుగా ఉన్నా సరే… ఈ టీ తాగటం వలన మూత్రపిండాలు మరియు ప్రోస్టేట్ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.. మూత్రశాయ ఇన్ ఫెక్షన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. వేప పండు చిగురు వాపు మరియు దంత క్షయాన్ని నయం చేయడానికి సహాయపడుతుంది. ఇది పంటి నొప్పి వంటి దంత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

వేప పండ్లలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు సమృద్దిగా ఉండుట వలన ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది. కంటికి సంబందించిన సమస్యలను తగ్గించటానికి సహాయపడుతుంది. పైల్స్ సమస్యతో బాధపడేవారు ప్రతి రోజు రెండు వేప పండ్లను తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది.

వేప పండ్ల పేస్ట్ ని జుట్టుకి పట్టించి అరగంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేస్తే జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య తొలగిపోతాయి. అలాగే చర్మ సమస్యలు ఉన్నప్పుడు ప్రభావిత ప్రాంతంపై వేప పండ్ల పేస్ట్ రాస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది. కాబట్టి వేప పండ్లను ఉపయోగించటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.