Healthhealth tips in telugu

Spinach:కిడ్నీ సమస్యలు ఉన్నవారు పాలకూరను తినకూడదు.. నిజం ఎంత..?

Palakura Side Effets In Telugu : ఆకుకూరల్లో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అటువంటి ఆకుకూరల్లో ఒకటైన పాలకూరలో ఉన్న పోషకాలు ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం. పాలకూరలో కాల్షియం., మెగ్నీషియం, ఐరన్, విటమిన్ ఏ, సి, కె వంటివి చాలా సమృద్ధిగా ఉంటాయి. పాలకూరలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనలో చాలామంది ఎక్కువగా తింటూ ఉంటారు.

అలా ఎక్కువగా తినటం వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా లిమిట్ గా తీసుకుంటేనే మన శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. పాలకూరని తీసుకోవడం వలన అధిక బరువు తగ్గటంలో సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి చాలా మేలును చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.

అలాగే పాలకూరలో తక్కువ గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ ఉంటుంది. రోజులో చిన్న కప్పు పాలకూరను మాత్రమే తీసుకోవాలి. లేదంటే వారంలో రెండు లేదా మూడు సార్లు పాలకూరను తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎటువంటి సమస్యలు రావు. అలా కాకుండా ఎక్కువగా తీసుకుంటే ఏ సమస్యలు వస్తాయో చూద్దాం.

పాలకూరలో ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది, ఇది మొక్కలలో సహజంగా లభించే కాంపౌండ్‌. శరీరంలో ఆక్సాలిక్‌ యాసిడ్‌ మోతాదు మించితే శరీరం ఇతర పోషకాలు గ్రహించే సామర్థ్యం తగ్గుతుంది. కిడ్నీలో రాళ్ళ సమస్యతో బాధపడుతున్నవారు పాలకూరకు దూరంగా ఉంటేనే మంచిది. ఎందుకంటే పాలకూర ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఆక్సాలిక్‌ యాసిడ్‌ మోతాదు పెరుగుతుంది.

మన శరీరం ఆక్సాలిక్‌ యాసిడ్‌ను బయటకు పంపడం కష్టమవుతుంది. దీని వల్ల కిడ్నీల్లో కాల్షియం ఆక్సలేట్ రాళ్లుగా ఏర్పడే అవకాశం ఉంది. అలాగే కీళ్ల నొప్పులు ఉన్నవారు కూడా పాలకూర ఎక్కువగా తీసుకోకూడదు. పాలకూరలో ఆక్సాలిక్ యాసిడ్‌తో పాటు, ప్యూరిన్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఈ రెండు కలిపి నొప్పులు పెరగటానికి కారణం అవుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.