Kitchenvantalu

Saggubiyyam Payasam:కమ్మని రుచితో సగ్గుబియ్యం పాయసం.. ఒంటికి చలువ చేసే స్వీట్..

Saggubiyyam Payasam;సగ్గు బియ్యం పాయసం..పాయసం అనగానే ,సేమియా తో చేసేయడం అలవాటై పోయింది.కాస్త వెరైటీగా సగ్గుబియ్యం తో ట్రై చేయండి.

కావాల్సిన పదార్ధాలు
సగ్గుబియ్యం – 1 కప్పు
పాలు – 2 కప్పులు
చక్కెర – ½ కప్పు
జీడిపప్పు – 1 టేబుల్ స్పూన్
ఎండుద్రాక్ష – 1 టేబుల్ స్పూన్
కొబ్బరి పొడి – 2 టేబుల్ స్పూన్స్
యాలకుల పొడి – ½ టీ స్పూన్
నెయ్యి – 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం
1.ముందుగా కప్పు సగ్గుబియ్యాన్ని గంట పాటు నానబెట్టుకోవాలి.
2.చక్కెర,యాలకులను తీసుకోని మిక్సి జార్ లో పొడి చేసుకోవాలి.
3.ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని అందులోకి రెండు కప్పుల నీళ్లను వేడి చేసుకోవాలి.
4.నీళ్లు మరుగుతున్నప్పుడు నాన బెట్టుకున్న సగ్గుబియ్యం వేసి ఉడకించుకోవాలి.

5.సగ్గుబియ్యం ఉడికిందా లేదా చెక్ చేసుకోని పక్కన పెట్టుకోవాలి.
6.ఇప్పుడు వేరొక గిన్నెలో పాలు వేడిచేసుకోవాలి.
7.మరిగిన పాలల్లో ఉడకిన సగ్గుబియ్యం వేసి పదినిమిషాలు ఉడికించుకోవాలి.
8.పాలు కాస్త చిక్కపడ్డాక చక్కెర,యాలకుల పొడి ,కొబ్బరి పొడి వేసి కలుపుకోవాలి.
9.నెయ్యి ల ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని నెయ్యితో పాటుగా వేసి కలుపుకుంటే సగ్గు బియ్యం పాయసం రెడీ.