MoviesTollywood news in telugu

Tollywood:ఈ ఫోటోలో కనిపిస్తున్న టాలీవుడ్ కమెడియన్‌ను గుర్తుపట్టారా…?

Bandla ganesh Unknown Facts In Telugu : చిన్నప్పుడు కొందరు అందంగా ముద్దుగా ఉన్నా, పెద్దయ్యాక తేడా వచ్చేస్తుంది. కొందరు చిన్నప్పుడు అందంగా లేకున్నా పెద్దయ్యాక హ్యాండ్సమ్ గా మారిపోతారు. అందుకే చిన్నప్పటి ఫోటోలు చూపిస్తే కొందరివి అసలు గుర్తుపట్టలేం. ఇప్పుడు కూడా అలాంటి ఉదంతమే తెల్సుకుందాం. ఓ ఫోటో ఇప్పుడు నెట్ లో హల్చల్ చేస్తోంది.

ఎక్కడో చూసినట్లుందే.. అర్రే బాగా తెలిసిన మొహంలా కూడా అనిపిస్తుంది.. చాలా సినిమాల్లో చూసాం కానీ గుర్తు రావడం లేదే అనిపిస్తుంది. అయితే కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే, వెంటనే గుర్తొస్తాడు. ఎందుకంటే అంత ఈజీగా మరిచిపోయే ఫేస్ కాదు ఇది.

అంత త్వరగా తగ్గిపోయే ఫేమ్ కూడా కాదు. ఇతగాడు నోరు విప్పాడంటే రచ్చ రచ్చే.. భజన సంఘాలు కూడా ఇతడిని ఫాలో అయిపోవాల్సిందే. అంత  మాటల మరాఠీ. అనగానే తక్కున్న గుర్తొచ్చేది నటుడు,నిర్మాత, రాజకీయ నాయకుడు కూడా అయిన బండ్ల గణేష్ అని చెప్పేయొచ్చు. కొన్ని దశాబ్ధాల క్రితమే ఇండస్ట్రీకి వచ్చాడు.

మీసాలు కూడా రాని వయసులోనే ఇండస్ట్రీకి వచ్చి.. ఇప్పటికీ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని ఇక్కడే ఉండిపోయాడు.ఇక్కడే సెటిల్ అయిపోయాడు. బండ్ల గణేష్ ఆ తర్వాత మెల్లగా కమెడియన్ గా అవతారం ఎత్తి,ఉన్నట్టుండి నిర్మాతగా మారి బ్లాక్‌బస్టర్ ప్రొడ్యూసర్‌గా మారిపోయాడు.